BigTV English

Salman Khan : షూటర్ అరెస్ట్ వెలుగులోకి షాకింగ్ విషయాలు… ఆ సింగర్ మాదిరిగానే సల్మాన్ ఖాన్ హత్య ప్లాన్

Salman Khan : షూటర్ అరెస్ట్ వెలుగులోకి షాకింగ్ విషయాలు… ఆ సింగర్ మాదిరిగానే సల్మాన్ ఖాన్ హత్య ప్లాన్

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల కాలంలో వరుసగా హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హత్య ప్లాన్ బయటపడగా, షూటర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.


షూటర్ అరెస్ట్ 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటిముందు ఈ ఏడాది ఏప్రిల్ 14న కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. వారిలో మరో నిందితుడిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, తాజాగా హర్యానాలోని పానిపట్ లో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi)  గ్యాంగ్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతన్ని ఈరోజే కోర్టులో హాజరు పరచనున్నారు.


ఈ ఏడాది ఏప్రిల్ లో ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర ఇద్దరు దుండగులు 6 రౌండ్ కాల్పులు జరిపిన సంగతి గుర్తుండే ఉంటుంది.. ఆ తర్వాత వచ్చిన నిందితులు బైక్ పై అక్కడ నుంచి పరారయ్యారు. ఇక అప్పట్లో ముంబైలో కలకలం రేపిన ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక్కో విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్ లోని నిందితులను విచారిస్తూ షాకింగ్ విషయాలను బయటకు వచ్చేలా చేస్తున్నారు. కేసును ఇన్వెస్ట్ గేట్ చేస్తున్న క్రమంలో జూన్లో కూడా మరోసారి సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ట జరిగినట్టుగా తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో ఆయనపై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

పంజాబీ సింగర్ హత్య మాదిరిగానే ప్లాన్…

కృష్ణ జింక వివాదంలోని సల్మాన్ ఖాన్ (Salman Khan)ను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో హత్య బెదిరింపులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అరెస్టు అయిన ఆ వ్యక్తి షార్ప్ షూటర్ అని సమాచారం. అతన్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్లో కీలకమైన వ్యక్తి అని అంటున్నారు. సల్మాన్ ఖాన్ ను అంతమొందించడానికి, ఆయన కదలికలను పర్యవేక్షించడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాదాపు 60 నుంచి 70 మందిని తన గ్యాంగ్ లో చేర్చుకున్నట్టు పోలీసులకు విచారణలో వెళ్లడైంది. కాగా సల్మాన్ ఖాన్ హత్యను పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య మాదిరిగానే ప్లాన్ చేశారనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ ను కార్లోనే హత్య చేయాలని ఈ గ్యాంగ్ స్కెచ్ వేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైన రాజకీయ నాయకుడు సిద్ధిఖీని దసరా రోజునే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీని పెట్టినప్పటికీ ఏ క్షణం ఏమవుతుందో అన్న గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయనకేం కాకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×