Katrina Kaif : బాలీవుడ్ స్టార్ హీరో కండలు వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్స్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా అంతగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు. కొంత కాలం క్రితం సల్మాన్ ‘ టైగర్ 3’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనే టాక్ ని అందుకుంది.. ప్రస్తుతం సల్లు భాయ్ సికిందర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి ట్రైలర్ ని ఆదివారం రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు సల్మాన్ ఖాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
కత్రినా కైఫ్ ను ఇరికించిన సల్మాన్..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఈవెంట్ లో సల్లు భాయ్ ని కత్రినా కైఫ్ గురించి అడిగారు. దానికి ఆయన కూల్ గా సమాధానం చెప్పాడు. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుంది. పిల్లల్ని కనబోతుంది. ఆమెకు పిల్లలు పుడితే నాకు చూడాలని ఉంది అని అన్నాడు.సల్మాన్ ఖాన్ అలా అనడంతో… బాలీవుడ్ మిగితా హీరోయిన్లు.. ఎవరైతే.. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నారో వాళ్లతో కంపేర్ చేస్తూ.. కత్రినా కైఫ్ కూడా పిల్లలు కనాలి అని అంటున్నారు. అంటే పెళ్లి చేసుకున్న హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ నటించడా? మరేదైన ఉద్దేశ్యం ఉందా అన్నది తెలియలేదు కానీ ఇది మాత్రం బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది..
సికిందర్ మూవీ ..
సల్మాన్ ఖాన్ మరోసారి మాస్ యాక్షన్‌తో అదరగొట్టనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మాస్ లుక్‌లో ఆయన ఎలివేషన్ అదిరిపోయింది. యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలిపిన ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉండనుంది. లవ్, రివేంజ్, న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా సల్మాన్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సల్మాన్ జోడీగా రష్మిక కెమిస్ట్రీ బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ వీడియో అందరిని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీతో సల్మాన్ ఖాన్ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.. రష్మిక మందన్న మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తుంది. మరి ఈ మూవీతో భారీ సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి..