Spirit: ఇప్పటివరకు వచ్చిన ప్రభాస్ కాంబినేషన్స్ ఒక ఎత్తైతే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న “స్పిరిట్” సినిమా మరో లెవల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్జీవీ స్కూల్ నుంచి వచ్చిన సందీప్ రెడ్డి వంగ, “అర్జున్ రెడ్డి” నుంచి టాలీవుడ్‌లో డిఫరెంట్ స్టైల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో “కబీర్ సింగ్” తో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత, “ఏనిమల్” తో నేషనల్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్-ఇండియా స్టార్ హీరోతో కాంబినేషన్ కుదిరింది అంటే… ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే!
ఈ ప్రాజెక్ట్ 2021లో అనౌన్స్ చేసినప్పటి నుంచి “స్పిరిట్” ఎప్పుడు మొదలవుతుందా? అనే హైప్ మాములుగా లేదు. సందీప్ రెడ్డి వంగ స్టైల్, ప్రభాస్ మ్యానరిజం, బీస్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్ – ఈ మూడింటినీ మిక్స్ చేస్తే ఓ పాత్ బ్రేకింగ్ యాక్షన్ ఫిల్మ్ రాబోతుందని ఫ్యాన్స్ మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు. అయితే, ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయ్యింది, పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయిందట!
ఇండస్ట్రీలో చాలా రోజులుగా “స్పిరిట్” గ్రాండ్ లాంచ్ ఉగాది కానుకగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం వచ్చేసినట్టే. మరో 7 రోజుల్లో సినిమా పూజా కార్యక్రమం జరగనుంది. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి, ముహూర్త కార్యక్రమానికి రెడీగా ఉన్నాడట. స్పిరిట్ లాంచ్ రోజున ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ ఫోటోలు బయటకు వస్తే.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ.
ఈ సినిమాతో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు అతను చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఫాంటసీ, రొమాంటిక్ యాక్షన్ గెటప్స్. కానీ పోలీసు గెటప్‌లో ప్రభాస్ ఏ రేంజులో ఉంటాడు? ఆ ఆలోచనే గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సందీప్ రెడ్డి స్టైల్ రా, ఇంటెన్స్, బోల్డ్, హై వోల్టేజ్ ఎమోషన్స్ స్పిరిట్ లో పక్కా ఉంటాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్, ఫౌజీ పూర్తి కాగానే… స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్‌ల లో “స్పిరిట్” కూడా ఒకటి. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించబడిందని టాక్. ప్రొడక్షన్ వాల్యూస్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ యాక్షన్, విజువల్ స్పెక్టాకుల్ గా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ లెవల్ కెమెరా వర్క్, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్న మూవీ అవుతుందని టాక్.
ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో అత్యంత మాసివ్ యాక్షన్ రోల్స్‌లో ఒకటిగా నిలిచేలా ఉంది. సందీప్ రెడ్డి వంగ తన మార్క్ స్క్రీన్‌ప్లే, విజన్‌తో ఈ సినిమాను ఒక అన్‌స్టాపబుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతకాలంగా “సాహో” రేంజ్ యాక్షన్ మాస్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారో, “స్పిరిట్” దానికంటే టెన్షన్, థ్రిల్, మాస్ యాక్షన్ పీక్స్ లో ఉండబోతుందట!