Rishabh Pant – Kuldeep: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం అయి… మూడు రోజులు కాలేదు…అంతలోనే ఉత్కంఠ మ్యాచ్ లు, క్రేజీ రికార్డులు నమోదు అవుతున్నాయి. అయితే… తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Delhi Capitals vs Lucknow Supergiants) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant ), ఢిల్లీ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ మధ్య జరిగిన ఓ ఫన్నీ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. మ్యాచ్ ఉత్కంఠంగా జరుగుతున్న సమయంలో…. ఢిల్లీ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ ను క్రీజు నుంచి బయటకు నెట్టి మరీ స్టంప్ కొట్టాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్.
Also Read: Ashutosh Sharma: ఎవరీ అశుతోష్ శర్మ.. కాటేరమ్మకు అసలు సిసలు వారసుడు ?
దీంతో ఈ సంఘటన వైరల్ అవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయిన సమయంలో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చాడు. మరో వైపు అషుతోష్ శర్మ భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వికెట్ ఏ మాత్రం ఇవ్వడం లేదు. ఈ సమయంలో… కుల్దీప్ యాదవ్ ను ( Kuldeep Yadav) ఔట్ చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్కెచ్ లు వేయడం మొదలు పెట్టాడు. ఈ తరుణంలోనే.. రవి బిష్ణోయ్ వేసిన బంతిని ఎదుర్కొన్న కుల్దీప్ యాదవ్ కాస్త ముందుకు వెళ్లి ఆడాడు. ఆ సమయంలో… కుల్దీప్ యాదవ్ ను ముందుకు నెట్టేసి… స్టంప్ కొట్టాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్. దీంతో… అక్కడ ప్లేయర్లందరూ నవ్వుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కావాలనే అలా చేసి… అందరనీ నవ్వించాడు.
Also Read: PBKS VS GT: గుజరాత్ తో పంజాబ్ ఫైట్… అయ్యర్ బిగ్ స్కెచ్…జట్ల వివరాలు ఇవే !
లక్నోకు చుక్కలు చూపించిన అషుతోష్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Delhi Capitals vs Lucknow Supergiants) జట్ల మధ్య మ్యాచ్ విశాఖ పట్నంలోని అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అంచున ఉండగా… చివరలో అషుతోష్ శర్మ ( Ashutosh Sharma) ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి.. జట్టును గెలిపించాడు. 31 బంతుల్లోనే.. 66 పరుగులు చేసి.. రఫ్ ఆడించాడు. ఇందులో 5 సిక్సర్లు, 5 బౌండరీలు కూడా ఉన్నాయి. దీంతో… 3 బంతులు మిగిలి ఉండగానే… లక్నో సూపర్ జెయింట్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కాగా నిర్ణీత 20 ఓవర్లలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్… 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే… 9 వికెట్లు నష్టపోయి చేధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది ఢిల్లీ.
Bro is me,me is bro 🏃😭#DCvsLSG #RishabhPant #ashutosh
pic.twitter.com/8fb2AppcjP— Urstruly Vinodh (@UrsVinodhDHFM) March 25, 2025