BigTV English

Samantha : సమంత .. సరికొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ .. ఎప్పుడూ.. ఎక్కడా.. తెలుసా?

Samantha : సమంత .. సరికొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ .. ఎప్పుడూ.. ఎక్కడా.. తెలుసా?
Samantha

Samantha : సమంత.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి. సినిమాల వల్ల ఎంత పేరు తెచ్చుకుందో.. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కోడలుగా మారి.. ఆ తర్వాత విడాకులు తీసుకొని అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది. చైతన్యకు సమంతకు విడాకులు జరిగిన క్షణం నుంచి ఇద్దరు ఏది చేసినా.. ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో ఆ టాపిక్ వైరల్ అవుతూనే వస్తుంది. ఈ ఇద్దరు విడాకులు వెనుక అసలు కారణం ఏమిటి అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. 


ఈ నేపథ్యంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక వెబ్ సిరీస్ లో హద్దులు దాటి నటించడమే దీనికి ముఖ్య కారణం అన్న పుకారు కూడా అక్కడక్కడ వినిపిస్తుంది.అయితే ఈ విషయంపై చైతన్య కానీ , సమంత కానీ ఇంతవరకు స్పందించింది లేదు. తాజాగా నాగచైతన్య అమెజాన్ ప్రైమ్ లో దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మీకు ఏ వెబ్ సిరీస్ అంటే ఇష్టం అంటే సమంత నటించిన ఫ్యామిలీ మెన్ అంటే ఇష్టమని చైతన్య చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రమోషన్ స్టంట్ అని అన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి. మొత్తానికి నిజం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.

రీసెంట్ గా సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఖుషి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఊహించిన ఫలితాన్ని అందుకోలేదు కానీ.. ఇందులో సమంత గ్లామర్ షోపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. ఇక ఇప్పుడు సమంత సరికొత్త క్రైమ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. సమంత ,బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సిరీస్ గురించి అందరికీ తెలిసిందే. 


ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కావడంతో.. విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ లో కూడా సమంత చాలా బోల్డ్‌గా నటించినట్లు సమాచారం. హాలీవుడ్ వర్షన్ లో ప్రియాంక రోల్ సమంత ఇండియన్ వర్షన్ లో ప్లే చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 24 ,2024 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది. మరి ఇందులో సమంత బోల్డ్ సీన్స్ ఏ కాంట్రవర్సీకి దారితీస్తాయో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×