Big Stories

Mehidy Hasan : అప్పుడు కలిసొచ్చింది, ఇప్పుడు దెబ్బకొట్టింది: బంగ్లా బౌలర్  హాసన్

Mehidy Hasan

Mehidy Hasan : బంగ్లాదేశ్-కివీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఒకవైపు 172 పరుగులకి తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయిన బంగ్లాదేశ్ కి హ్యాడ్లింగ్ ది బాల్ వివాదం నెట్టింట రచ్చ చేస్తోంది. మరో వైపు కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి ఏటికి ఎదురీదుతోంది.

- Advertisement -

ఈ పరిస్థితుల్లో రెండో రోజు ఆట వర్షం వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. లేకపోయి ఉంటే, ఏదొక సంచలనాలు నమోదయ్యేవి. ఒకరకంగా చెప్పాలంటే వరుణుడు వచ్చి కవీస్ ని కాపాడడనే చెప్పాలి. వర్షం తర్వాత పిచ్ లో ఏమైనా మార్పులొచ్చి కివీస్ కి కలిసి వస్తుందేమో చూడాలి.

- Advertisement -

మ్యాచ్ చూస్తే ఇంత రసవత్తరంగా ఉంటే, అందులో జరిగిన హ్యాడ్లింగ్ ది బాల్ వివాదం ఇంకా రైజ్ అవుతోంది. ఫీల్డింగ్ కి విఘాతం కలిగించి, ఆ జట్టు తరఫున ఇలా పెవిలియన్ చేరిన తొలి ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ ఒక చెత్త రికార్డ్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టైమ్డ్ అవుట్ విషయంలో ఇంటా, బయటా వివాదస్పదమై బంగ్లా జట్టు తలఎత్తుకోలేకుండా చేసింది.

ఇప్పుడు అలాంటి అవుట్ తో మరొకటి మూట కట్టుకుంది. బంగ్లాదేశ్ జట్టు ఆడలేక మద్దెలదరువు అన్నట్టు తొండాటలు ఆడేందుకు ప్రయత్నిస్తోందా? అని నెట్టింట ట్రోలింగులు మొదలయ్యాయి. హ్యాడ్లింగ్ ది బాల్  విషయమై బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ మెహిది హాసన్ మాట్లాడాడు. ముష్ఫికర్ కావాలని దానిని పట్టుకోలేదని తెలిపాడు. అది అసంకల్పిత ప్రేరేపిత చర్యగా పేర్కొన్నాడు. తనకి తెలియకుండానే చెయ్యి అలా వెళ్లిపోయిందని తెలిపాడు. అలా చేత్తో ఆపి అవుట్ కావాలని ఎవరు కోరుకుంటారని అన్నాడు. అందువల్ల అతన్ని నిందించడం కరెక్ట్ కాదని అన్నాడు.

రెండో టెస్ట్ లో అంత కఠినమైన పిచ్ మీద అందరూ అవుట్ అయిపోతుంటే ముష్ఫికర్ ఎంతో అనుభవజ్నుడిలా ఆడాడు. ఆ 35 పరుగులు ఇప్పుడెంతో కీలకంగా మారాయని అన్నాడు. నిజానికి ఆ హ్యాడ్లింగ్ ది బాల్ జరిగి ఉండకపోతే,తనింకా పరుగులు చేసేవాడు. అప్పుడు బంగ్లాదేశ్ నిర్ణయాత్మక స్థితికి చేరి ఉండేది. ఇదే స్కోరుతో రెండు ఇన్నింగ్స్ ల్లో కివీస్ ను ఆలౌట్ చేసేవాళ్లమని అంటున్నాడు.

ఆరోజు మ్యాథ్యూస్ విషయంలో ఆ టైమ్డ్ అవుట్ మాకు కలిసి వచ్చింది. మ్యాచ్ విజయం సాధించాం. కానీ ఈరోజు హ్యాడ్లింగ్ ది బాల్ మాకు కలిసి రాలేదు. నష్టం చేసేదిగా ఉందని చెబుతున్నాడు. అయితే తనే ఉద్దేశంతో అన్నా, నెటిజన్లు మాత్రం చేసిన తప్పుకి ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు. కానీ మీకు ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News