Samantha: సెలైన్ పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్న ఫోటో ముందుగా రిలీజ్ అయింది. అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్. అభిమానులు ఉలిక్కిపడ్డారు. సామ్ కు ఏమందని ఆందోళన చెందారు. అప్పటికే ఆమె అనారోగ్యంతో ఉన్నారనే వార్తలకు ఆ ఫోటో మరింత బూస్ట్ ఇచ్చింది. సమంతకు మయోసైటిస్ అని తెలిసి.. అసలేంటా రోగం అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ప్రమాదకర వ్యాధికి చికిత్స తీసుకుంటూనే.. కమిటెడ్ గా యశోద మూవీకి డబ్బింగ్ చెబుతున్నారంటూ ప్రశంసలు వచ్చాయి. కట్ చేస్తే…
యశోద మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో సమంత కన్నీళ్లు పెట్టుకోవడం కలకలం రేపింది. మీడియా అటెన్షన్ తో క్షణాల్లో ఆ విషయం వైరల్ అయింది. తానింకా చావలేదంటూ.. మరింత పోరాటం చేస్తానంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఆ ఇంటర్వ్యూతో సమంత న్యూస్ ట్రెండింగ్ లో నిలిచింది. టాప్ హీరోయిన్ అలా కన్నీటి పర్యంతం అవడం అనేక మందిని కలిచి వేసింది. అయ్యో పాపం అంటూ సమంత గురించి, ఆమె అనారోగ్యం గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఆ ఫోటో గానీ, ఈ ఇంటర్వ్యూ గానీ.. యశోద మూవీ రిలేటెడ్ గానే సాగడంతో ఆ సినిమాకు ఫుల్ హైప్ వచ్చింది.
ఎప్పుడెప్పుడు యశోద రిలీజ్ అవుతుందా.. సమంత కోసం ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనే ఆరాటంలో ఉన్నారు ప్రేక్షకులు. మూవీలో సమంత లుక్ ఎలా ఉంది? మునుపటిలానే ఛార్మింగ్ గా ఉందా? మయోసైటిస్ ఎఫెక్ట్ కనిపిస్తుందా? చర్మంపై ఏదైనా తేడా ఉందా? ఇవన్నీ వెంటనే తెలుసుకోవాలనే ఆత్రుత నెలకొంది. యశోద రిలీజ్ డేట్ ను నెట్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారంటే.. సమంత కోసం ఆ సినిమాకు ఎంత క్రేజ్, హైప్ వచ్చిందో అర్థం అవుతోంది. భారీ ఓపెనింగ్స్ పక్కా అని తెలిసిపోతోంది. యశోద ఏమాత్రం బాగున్నా.. సూపర్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.