BigTV English
Advertisement

Samantha: సమంతలో కొత్త మార్పు గమనించారా.. ఇది కదా కావాల్సింది

Samantha: సమంతలో కొత్త మార్పు గమనించారా.. ఇది కదా కావాల్సింది

Samantha: అందాల భామ సమంత  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది. దానికన్నా ముందు చిన్న యాడ్స్ లో కనిపించిన సామ్.. సినిమాల్లోకి రావడానికి సర్జరీలు చేయించుకుందని టాక్ నడిచింది. అందులో ఎంత నిజం అన్నది తెలియదు కానీ.. యాడ్స్ లో సమంత ఫేస్ కి.. సినిమాల్లో ఆమె ఫేస్ కు చాలా తేడా ఉంది అన్నది మాత్రం నిజం.  ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సామ్.. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.


ఇక హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సామ్  అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. అందం, అభినయం కలగలిపిన రూపం సమంతది. ఎన్నో ఏళ్ళ ప్రేమ ఫలితం ఇప్పుడు పెళ్లిగా రూపుదిద్దుకుంటుంది అనేసరికి ఆమె ముఖంలో కొత్త అందం కొట్టొచ్చినట్లు కనిపించేది. తన పెళ్లికి కావాల్సిన డిజైనర్ చీరలను కూడా ఆమె దగ్గరుండి డిజైన్ చేయించుకుంది. ఇప్పటివరకు సామ్ పెళ్లి చీరలా ఏ సెలబ్రీటీ చీర లేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ చీరపై.. చైతో గడిపిన జ్ఞాపకాలను డిజైన్ చేయించుకుంది. అతడితో బీచ్ కి వెళ్లడం.. తొలిసారి ప్రపోజ్ చేసిన స్థలం.. ఎంగేజ్ మెంట్ ఫొటోస్..  వెకేషన్ ఫొటోస్.. ఇలా ప్రతిదీ ఎంతో అపురూపంగా  చేయించుకుంది.

పెళ్లి తరువాత కూడా సామ్ ముఖం అస్సలు మారలేదు. ఇంకా చెప్పాలంటే అందం మరింత ఎక్కువ అయ్యింది. గ్లామర్ పెరిగింది. హెయిర్  కట్ చేయించుకొని ఒక కొత్త సామ్ కనిపించేది. కొన్ని కొన్ని సందర్భాల్లో సామ్ ను మించిన అందం ఇంకెక్కడా లేదు అని అనిపించేలా కనిపించేది. ఇక ఆ అందం, ఆ గ్లామర్ .. చైతో విడిపోయాకా సామ్ లో కనిపించలేదు.  అందుకు కారణం.. ఆమె మయోసైటిస్ బారిన పడడమే.  చర్మ సంబంధింత వ్యాధి కావడంతో .. ఆ ఎఫెక్ట్ మొత్తం ముఖంపైనే కనిపించింది.


SKN: చిరంజీవి వారసుడి వివాదం.. వారు శునకానందం పొందుతున్నారు

మయోసైటిస్ చికిత్స సమయంలో సామ్ ముఖం పూర్తిగా మారిపోయింది. బక్కచిక్కిపోయి.. ముఖం అంతా పాలిపోయి.. అసలు ఈమె సమంతనేనా అని గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. ఒక ఏడాది పాటు  సోషల్ మీడియాకు కూడా దూరమై.. సామ్ ప్రకృతిలో ఒదిగిపోయింది. కఠినమైన ట్రీట్మెంట్  తీసుకుంటూ.. డైట్ చేస్తూ.. ఎంతో కష్టపడింది. తన శరీరం మొత్తం స్టెరాయిడ్స్  నిండిపోయినా.. సూదులు గుచ్చుతున్నా తట్టుకొని నిలబడింది.

అప్పుడప్పుడు సమంత  సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. మొన్నటి వరకు ముఖం మొత్తం ఎండిపోయినట్లు.. చాలా బక్కగా కనిపించిన సామ్ ముఖంలో ఈసారి చాలా మార్పులు కనిపించాయి. సామ్ మునుపటి రూపంలోకి  వస్తుందని తెలుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తుంటే.. పాత సమంత తిరిగి వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో కొత్త సంతోషం.. కొద్దిగా బుగ్గలు వచ్చి ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు.. అబ్బా ఇది కదా మాకు కావాల్సింది. ఎంత క్యూట్ గా ఉన్నావ్ సామ్.. ఇలానే ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×