E-Paper
Advertisement

Pakistan Cricketers Fined: దూల తీర్చిన ICC…ముగ్గురు పాకిస్థాన్‌ ప్లేయర్లపై భారీ ఫైన్‌ !

Pakistan Cricketers Fined: దూల తీర్చిన ICC…ముగ్గురు పాకిస్థాన్‌ ప్లేయర్లపై భారీ ఫైన్‌ !
Advertisement

Pakistan Cricketers Fined: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ కంటే ముందే పాకిస్థాన్‌ ప్లేయర్లకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఏకంగా ముగ్గురు పాకిస్థాన్‌ ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ వేటు వేసింది. షాహీన్ షా ఆఫ్రిది ( Shaheen Shah Afridi ), సౌద్ షకీల్ అలాగే కమ్రాన్ గులామ్‌లకు జరిమానా విధించింది ఐసీసీ పాలక మండలి. సౌతాఫ్రికా ప్లేయర్లతో రూడ్‌ గా ప్రవర్తించినందుకు గానూ… షాహీన్ షా ఆఫ్రిది, సౌద్ షకీల్ ( Saud Shakeel ) అలాగే కమ్రాన్ గులామ్‌లకు జరిమానా విధించడం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఐసీసీ. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ కంటే ముందే పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య… ట్రై సిరీస్‌ నిర్వహించారు. పాకిస్థాన్‌ దేశంలోనే.. ఈ వన్డే సిరీస్‌ మూడు జట్ల మధ్య జరుగుతోంది.

Also Read: Rishabh Pant: ఆనాడు రిషబ్‌ పంత్‌ను కాపాడాడు.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు !

Advertisement

ఇప్పటికే ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌ దశకు వచ్చింది. న్యూజిలాండ్, పాకిస్థాన్‌ జట్ల మధ్య రేపు అంటే శుక్రవారం రోజున ఫైనల్‌ కూడా జరుగనుంది. ఆ తర్వాత… ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ లు ప్రారంభం కానున్నాయి. అయితే.. బుధవారం.. రోజున సౌతాఫ్రికా వర్సెస్‌ పాకిస్థాన్‌ జట్ల మధ్య ట్రై సిరీస్‌ లో భాగంగా… వన్డే మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా సౌతాఫ్రికా ప్లేయర్లతో రూడ్‌ గా బీహేవ్‌ చేశారు పాక్‌ ప్లేయర్లు. మొదటగా….సఫారీ ప్లేయర్‌ మాథ్యూ బ్రీట్జ్కే తో ( Matthew Breetzke ) గొడవ పెట్టుకున్నాడు పాకిస్థాన్‌ బౌలర్‌ షాహీన్ షా ఆఫ్రిది ( Shaheen Shah Afridi ). ఈ మ్యాచ్‌ 29 వ ఓవర్‌ లో ఈ సంఘటన జరిగింది. బ్యాటింగ్‌ చేస్తున్న సఫారీ ప్లేయర్‌ మాథ్యూ బ్రీట్జ్కే పైకి ( Matthew Breetzke ) గొడవకు వెళ్లాడు అఫ్రీది. అలా రెండు సార్లు ఒకే ఓవర్‌ లో జరిగింది.

Also Read: Natasha Pandya – Hardik Pandya: సిక్సులతో పాండ్యా ఉగ్రరూపం… నటాషా రియాక్షన్‌ అదుర్స్‌ !

Advertisement

ఇక ఆ తర్వాత… టెంబా బావుమాను ఔట్‌ చేసిన తర్వాత… రెచ్చిపోయి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు పాకిస్థాన్‌ ప్లేయర్లు. ఇందులో సౌద్ షకీల్ మరియు కమ్రాన్ గులామ్‌ ఇద్దరూ ఉన్నారు. సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ఇద్దరూ… కూడా వికెట్‌ కోల్పోయిన టెంబా బావుమాను ( Temba Bavuma) వెక్కిరించారు. పొట్టిగా ఉన్నాడంటూ గ్రౌండ్‌ లోనూ ర్యాగింగ్‌ చేశారు. దీంతో.. సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల పైన ( Kamran Ghulam ) ఫైన్‌ పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో ఐసిసి ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు షాహీన్ షా ఆఫ్రిదిపై ( Shaheen Shah Afridi ) తన మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించారు. అటు సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ ల మ్యాచ్‌ ఫీజులో 10% జరిమానా విధించారు. కాగా ఈ మ్యాచ్‌ లో సఫారీలను చిత్తు చేసి… ఫైనల్‌ కు వెళ్లింది పాకిస్థాన్‌. దీంతో రేపు న్యూజిలాండ్‌ వర్సెస్‌ పాక్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×