India Wicketkeeper – Champions Trophy: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈనెల 19 నుండి ప్రారంభం కాబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ చివరి వన్డే సిరీస్ లో అదరగొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ని 3 – 0 తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్ మొత్తానికి వికెట్ కీపర్ గా కే.ఎల్ రాహుల్ ని తీసుకుంది మేనేజ్మెంట్. మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ని బెంచ్ కే పరిమితం చేసింది.
Also Read: Pakistan Crickerts Fined: దూల తీర్చిన ICC…ముగ్గురు పాకిస్థాన్ ప్లేయర్లపై భారీ ఫైన్ !
ఈ మూడు వన్డేల సిరీస్ లో జట్టులోని మిగతా సభ్యులందరికీ కనీసం ఒక్క అవకాశం లభించినా.. ఆడే అవకాశం రాని ఏకైక ఆటగాడు పంత్. మొదటి రెండు వన్డేలలో పెద్దగా రాణించలేకపోయిన కేఎల్ రాహుల్.. చివరి వన్డేలో 29 బంతుల్లో 40 పరుగులు చేసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక మరో ఐదు రోజులలో ప్రారంభం కాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ గా { India Wicketkeeper – Champions Trophy} రాహుల్ కి జట్టులో చోటు కల్పిస్తారా..? లేక రిషబ్ పంత్ కి జట్టులో చోటు దక్కుతుందా..? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
దీనిపై తాజాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా మొదటి ఎంపిక కేఎల్ రాహుల్ అని తాజాగా ధ్రువీకరించారు కోచ్ గౌతమ్ గంభీర్. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా రిషబ్ పంత్ బెంచ్ పై కూర్చోవలసి ఉంటుందని సూచించాడు. ” ఇప్పుడు మా నెంబర్ వన్ వికెట్ కీపర్ కే.ఎల్ రాహుల్. ఇప్పటికైతే ఇదే చెప్పగలను. పంత్ కి ఏ క్షణంలోనైనా ఆడే అవకాశం దక్కవచ్చు.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ రాణిస్తున్నాడు. అయితే ఒక మ్యాచ్ లో ఇద్దరు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లతో ఆడలేం” అని తెలిపారు గౌతమ్ గంభీర్. అయితే జట్టులో 5వ స్థానంలోనే రాహుల్ ని ఆడిస్తారా..? అన్న ప్రశ్నకు.. ” ఇది కూడా స్పష్టంగా చెప్పలేము. ఏ ప్లేయర్ అయినా అయిదవ స్థానంలో ఆడవచ్చు. మాకు ఆటగాడి కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆ సమయంలో రికార్డులు చూడం. ఏ ఆటగాడు అయితే బాగా రాణించగలడో అతడినే పంపిస్తాం” అన్నారు.
Also Read: Rishabh Pant: ఆనాడు రిషబ్ పంత్‌ను కాపాడాడు.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు !
ఇక చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుండి ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ని తప్పించడానికి కారణం ఏంటని ప్రశ్నించగా.. ” జైస్వాల్ కి బదులుగా వరుణ్ చక్రవర్తి ని తీసుకున్నాం. దీనికి ఒకే ఒక్క కారణం ఏంటంటే బ్యాటర్ కి బదులుగా బౌలర్ ని ఎంచుకున్నాం. జైష్వాల్ కి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అలాగే ఒక జట్టుకు 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం” అన్నారు కోచ్ గౌతమ్ గంభీర్.
Gautam Gambhir confirms KL Rahul will be the first-choice wicketkeeper in the Champions Trophy! pic.twitter.com/mU25MDiU4i
— CRICKETNMORE (@cricketnmore) February 13, 2025