SKN: శ్రీనివాస్ కుమార్ అంటే ఇండస్ట్రీలో ఎవరికి తెలియకపోవవచ్చు. అదే SKN అంటే చాలు బేబీ నిర్మాత కదా అని గుర్తుపట్టేస్తారు. ఒక్క సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ చేరిపోయాడు SKN. అసలు అతని జీవితం ఎక్కడ మొదలయ్యింది అనేది కూడా అందరికి తెల్సిందే. మెగా ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్న వేళ.. అర్ధరాత్రి అని కూడా లేకుండా ఒక వ్యక్తి వారందరికీ తిరిగి కౌంటర్లు ఇస్తూ.. మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డాడు. అది గమనించిన అల్లు శిరీష్.. అతని గురించి అన్న అల్లు అర్జున్ కు చెప్తే.. వెంటనే బన్నీ.. అతను అక్కడ ఉండకూడదు మన దగ్గరకి తీసుకురండి అని చెప్పాడట. అలా SKN ప్రస్థానం మొదలయ్యింది.
హైదరాబాద్ వచ్చి ఒక చిన్న న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించి.. ఆ తరువాత అల్లు అర్జున్ కు పీఆర్ గా పనిచేసి.. చిన్న చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ బేబీ సినిమాతో నిర్మాతగా మారాడు. సరే ఇప్పుడు నిర్మాతగా మారాడు కదా అని.. మెగా ఫ్యామిలీని ఏదైనా అంటే ఊరుకుంటాడు అనుకోవడం పిచ్చితనం. ఇప్పటికీ మెగా ఫ్యామిలీని కానీ, అల్లు ఫ్యామిలీని కానీ, ఎవరైనా ఏదైనా అంటే.. పాత SKN బయటకు వచ్చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బాహుబలికి కట్టప్ప ఎలానో.. మెగా ఫ్యామిలీకి SKN అలా అనొచ్చు.
ఇక గత మూడు రోజుల నుంచి చిరంజీవిపై విమర్శలు వెల్లువలా దూసుకొస్తున్న విషయం తెల్సిందే. సరదాగా నవ్వుతూ చిరు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యామిలీ ఫోటో చూపించి మనవరాళ్ల గురించి మాట్లాడమంటే చిరు.. ఇంట్లో అందరూ ఆడపిల్లలే. హాస్టల్ వార్డెన్ లా ఉన్నట్లు అనిపిస్తుంది. చరణ్ కు చెప్తున్నాను ఒక మగపిల్లాడిని కనురా .. లెగసీని ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పుకొచ్చాడు.
Masthan Sai : మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్… నార్సింగ్ పోలీసుల చేతికి మస్తాన్ సాయి
సరదాగా చిరు నాన్న మాటలను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చి.. రాజకీయం చేసేశారు కొంతమంది. అమ్మాయిలు తక్కువగా చూస్తున్నారు అంటూ మహిళా సంఘాలు కూడా చిరుపై ఫైర్ అయ్యాయి. ఇదే అదునుగా తీసుకున్న రాజకీయ నాయకులు సైతం చిరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మెగాస్టార్ అని పిలిపించుకొనే వ్యక్తి అందరిముందు ఇలా మాట్లాడడం తప్పు అని, స్టేజిపై ఉన్నప్పుడు ఏది మాట్లాడాలో తెలియదా అని.. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు.
తాజాగా SKN.. చిరు వివాదంపై స్పందించాడు. చిరంజీవి అన్నదాంట్లో తప్పేమి ఉంది. తన దగ్గర లేని దాన్ని కావాలి అని అడిగాడు. చిత్ర పరిశ్రమలో, నటుల కుమారులు మరియు మనవళ్లు తరచుగా తమ కుటుంబ వారసత్వాన్ని నటనలో ముందుకు తీసుకెళ్లడం బాగా స్థిరపడిన ధోరణి. అయితే, కరీనా కపూర్, కరిష్మా కపూర్ వంటి కుమార్తెలు తమ కుటుంబం పేరును విజయవంతంగా నిలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మగ వారసులు చాలా సాధారణం అయితే, మహిళా నటులు కూడా తమదైన ముద్ర వేశారు. వారి కుటుంబ సినిమా వారసత్వాన్ని కొనసాగించారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొణిదెల తెలుగు, తమిళ్ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపునే తీసుకొచ్చుకుంది. మెగాస్టార్ అనుమతి లేకుండా అది జరిగేదా.. ? అని ఒక వెబ్ సైట్ పెట్టిన పోస్టును SKN ఆమోదించాడు.
” నిజం.. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది..నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
True. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది ….నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు https://t.co/grMBkAIFIK
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 13, 2025