BigTV English
Advertisement

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Samantha: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి “ఏ మాయ చేసావే” అనే సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాల దోచుకున్న సమంత (Samantha).. ఆ తర్వాత మహేష్ బాబు(Maheshbabu ), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి స్టార్ హీరోలతో నటించి, అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే సహ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న వీరు “మనం” సినిమా తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకి విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


మయోసైటిస్ తో నరకం చూసిన సమంత..

ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది సమంత. అదే సమయంలో మయోసైటిస్ (myositis) అనే వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకుంది. కోట్ల రూపాయలను ఖర్చు చేసి చికిత్స పొందింది. అంతే కాదు ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది సమంత.. అందులో భాగంగానే ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు నిర్మాతగా కూడా మారింది. మా ఇంటి బంగారం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే అందులో నటిస్తోంది కూడా. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi)తో తన రెండవ సినిమా కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం..


మతిమరుపు కూడా..

ఇదిలా ఉండగా తాజాగా మరొకవైపు బాలీవుడ్లో సిటాడెల్ హనీ బన్నీ (Honey – Bunny) వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటిస్ తో పాటు తనకు మరో భయంకరమైన వ్యాధి వచ్చిందని హాట్ బాంబు పేల్చింది సమంత. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయాను. మతిమరుపు వచ్చింది. ఎంతో ఇబ్బంది పడ్డాను. నన్ను ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, అసలు హెల్త్ గురించి ఎవరు అడగలేదని, ఇప్పుడు అనుకుంటూ ఉంటాను.. ఇదంతా మయోసైటిస్ కారణంగానే వచ్చింది అంటూ బాధపడింది సమంత. ఒకవైపు మయోసైటిస్ నుంచి బయటపడుతుంది అని కాస్త రిలాక్స్ అయ్యేలోపే , మళ్ళీ మతిమరుపు వచ్చింది అంటూ కామెంట్లు చేసి అభిమానులను మరోసారి కలవరానికి గురిచేసింది. అంతేకాదు తాను మళ్లీ సెట్స్ పైకి వచ్చేవరకు నిర్మాతలు ఎదురు చూసినందుకు కృతజ్ఞురాలై ఉంటాను అంటూ కూడా తెలిపింది. ఏది ఏమైనా సమంత ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ సమస్యల నుంచి బయట పడాలంటే అందరిలో కలివిడిగా ఉండాలని, మనసుకు నచ్చిన వారికి చేరువ అవ్వాలని కోరుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత చెప్పిన ఈ విషయాలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×