BigTV English

Samantha: చీకటి రోజుల నుంచి బయటపడ్డాను.. సమంత వ్యాఖ్యలు వైరల్

Samantha: చీకటి రోజుల నుంచి బయటపడ్డాను.. సమంత వ్యాఖ్యలు వైరల్

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతున్న విషయం తెల్సిందే. ఎంతో అరుదైన వ్యాధి అయినప్పటికీ.. సామ్ కఠోర శ్రమతో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక గతేడాది అంతా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్.. ఈ ఏడాది మొదటి నుంచి సినిమాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.


సినిమాలు విషయం పక్కన పెడితే.. ఈ మధ్యనే సామ్.. ఒక పాడ్ క్యాస్ట్ ను మొదలుపెట్టి హెల్త్ టిప్స్ ఇస్తున్న విషయం కూడా తెల్సిందే. ఇక అది వివాదంగా మారిన విషయమూ విదితమే. అయినా కూడా అమ్మడు తడబడకుండా తన పాడ్ క్యాస్ట్ ను రన్ చేస్తుంది.

ఇక తాజాగా సామ్.. ఒక ఇంటర్వ్యూలో విడాకుల తరువాత జీవితం గురించి చెప్పుకొచ్చింది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఇక ఆ సమయంలోనే ఆమె మయోసైటిస్ బారిన పడింది. ఇలా ఒకదాని తరువాత ఒకటి సామ్ జీవితంలో జరగడంతో ఆమె ఎంతో కృంగిపోయింది.


ఇంటర్వ్యూలో ఆ విషయమై సామ్ మాట్లాడుతూ.. ” ప్రతి ఒక్కరి జీవితంలో అనుకున్నవి జరగవు.. గత మూడేళ్ళలో నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నాకు ఏం చేయాలో తోచని పరిస్థితి. నా ఫ్రెండ్స్ తో కూడా ఈ విషయమై ఎన్నోసార్లు చర్చించాను. కానీ, నేను ఇప్పుడు బలంగా మారాను. విశ్వాసంతో ఉన్నాను. ఆ విశ్వాసమే ను ముందుకు నడుపుతుంది. గతంలో నేను ఎదుర్కున్న చీకటిరోజుల నుంచి బయటపడ్డాను.

ఇకనుంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ బలాన్ని ఇచ్చింది ఆధ్యాత్మిక చింతనే అని చెప్పొచ్చు. దాని వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సామ్ చేతిలో సిటాడెల్, మా ఇంటి బంగారం అనే సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో సామ్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×