Samantha Ruth Prabhu: “పడ్డ చోటే నిలబడాలి”.. అనే సామెతను చక్కగా దృష్టిలో పెట్టుకొని ఫాలో అవుతూ.. నేడు ఎవరూ అందుకోని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది సమంత (Samantha). ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను దక్కించుకుంది. కెరియర్ పరంగా స్టార్ స్టేటస్ నూ అందుకుంది. కానీ వ్యక్తిగతంగా విమర్శల పాలయ్యింది. అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. అయితే నాలుగేళ్లకే విడాకులు తీసుకొని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలామంది ఈమెపై ఊహించని కామెంట్స్ చేశారు. ఎన్నో ట్రోలింగ్స్ చేశారు. అంతేకాదు ఈమె క్యారెక్టర్ పై నెగిటివ్ మార్క్ కూడా వేశారు. ఇలా ఒక్కటేమిటి ఎన్నో విమర్శలతో పాటు ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొని అన్నింటిని దిగమింగుకొని ఇప్పుడు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది సమంత.
సెకండ్ హ్యాండ్ అన్నారు..
అయితే ఈ బాధలన్నింటినీ కూడా ఆమె ఏ రోజు బయటకు చెప్పుకోలేదు.. కానీ తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాధలన్నింటిని ఒక్కసారిగా బయట పెట్టి, భావోద్వేగానికి గురైంది. ఇక ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. “జీవితంలో ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే, దానిని జనం ఫెయిల్యూర్ గానే భావిస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఎంత కష్టంగా ఉంటుందో.. అనుభవించిన వారికే తెలుస్తుంది. పెళ్లైన నాలుగేళ్లకే చైతన్యతో నేను విడాకులు తీసుకున్నాను. ఆ తర్వాత ఎన్నో తీవ్రమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాను. నాపై చాలా రూమర్స్ వచ్చాయి. కొంతమంది ‘సెకండ్ హ్యాండ్’ అని కూడా కామెంట్ చేశారు. యూజ్డ్, వేస్ట్ అని కూడా అన్నారు. నాపై, నా క్యారెక్టర్ పై ఎన్నో అబద్ధాలు వ్యాప్తి చెందాయి. అయితే అవన్నీ నిజం కాదని ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పాలని అనిపించింది. కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదని ఆగిపోయాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది.
అన్నింటినీ వెనకే వదిలేసా..
” ఇకపోతే అవన్నింటినీ దిగమింగుకొని, నన్ను నేను మళ్లీ కొత్తగా జీవించాలని అనుకున్నాను. అన్ని నిందలు మోసిన నేను, మళ్లీ జీవితాన్ని మోయలేనా అనిపించింది. అందుకే ఎవరు ఏమన్నా సరే అన్నింటిని వెనకే వదిలేసి, ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా నాడు అడుగు ధైర్యంగా ముందుకు వేయడం వల్లే ఇప్పుడు నా కెరియర్ లో నేను చాలా సంతోషంగా ఉన్నాను.ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను. ఇకపై మునుముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక నన్ను ఎవరు వెనక్కి లాగే ప్రయత్నం చేయలేరు అంటూ చాలా ధీమా వ్యక్తం చేసింది సమంత. ఇక సమంత లాగే చాలామంది అమ్మాయిలు ఆలోచిస్తే, జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా వెనక్కి తగ్గాల్సిన అవసరం రాదు. ఇలా ఎంతోమంది మానసికంగా ఒత్తిడికి గురైన అమ్మాయిలకు సమంత బెస్ట్ ఎగ్జాంపుల్ అనడంలో సందేహం లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంతా మనోధైర్యానికి ఇండస్ట్రీ కూడా ఫిదా అవుతోంది.