BigTV English

Samantha: సమంత ఇంట పెళ్లి సందడి..

Samantha: సమంత ఇంట పెళ్లి సందడి..

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమంత సోదరుడు డేవిడ్  ప్రభు వివాహం అమెరికాలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. సెప్టెంబర్ 21 అనగా ఈరోజు.. డేవిడ్ ప్రభు వివాహం నికోల్ తో క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఫ్యామిలీ అనే క్యాప్షన్ ఇస్తూ.. కుటుంబంతో కలిసి గడిపిన అద్భుతమైన క్షణాలను అభిమానులతో షేర్ చేసింది.


ఇక ఈ ఫోటోలలో ఊదా రంగు డిజైనర్ గౌన్ లో సమంత మెరిసిపోతుంది.  ముఖ్యంగా ఆ డిజైనర్ డ్రెస్ లో పూలగుత్తి పట్టుకొని వస్తుంటే.. ఆమె పెళ్లి కూతురేమో అన్నంత అందంగా ఉంది సామ్. సామ్ ను ఇలా చూసి చాలా కాలం అవ్వడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు.  నాగ చైతన్యతో విడిపోయాక . . సామ్ ఒంటరిగానే ఉంటుంది.

ఇక సామ్ తో విడాకులు తీసుకున్నాకా.. ఈ మధ్యనే చై, నటి శోభితాను మరో వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. దీంతో సామ్ కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ నిర్మాతల్లో ఒకరైన రాజ్ నిడమూరుతో సామ్ ప్రేమాయణం సాగిస్తుందని వార్తలు వినిపించాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సామ్ కానీ, రాజ్ కానీ స్పందించలేదు.


ఇక సామ్ కెరీర్ చూసుకుంటే.. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా మా ఇంటి  బంగారం అనే సినిమా చేస్తుంది. కోలీవుడ్ లో  విజయ్ చివరి సినిమాలో కూడా సామ్ నే హీరోయిన్ అని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్స్ కు సామ్ సైన్ చేసిందని టాక్. మరి ఈ సినిమాలతో సామ్.. ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×