Monsoon Destinations: వర్షాకాలం వచ్చిన వెంటనే.. వర్షపు చినుకులు భూమిపై పడినప్పుడు, ప్రకృతి అందం రెట్టింపు అవుతుంది. వర్షాకాలంలో భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో అద్భుతమైన దృశ్యాలు మనం చూడవచ్చు. పర్వతాల నుండి పడే జలపాతాలు, పచ్చని అడవులు, దట్టమైన మేఘాలతో కప్పబడిన లోయలు, చల్లని గాలులు మనస్సును ప్రశాంతపరుస్తాయి.
ఈ సీజన్ లో వర్షం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో ప్రయాణించడం, ప్రకృతి అందాలను చూడటం మరచిపోలేని అనుభవాన్ని అందిస్తాయి. అందుకే వర్షాకాలంలో ఒక చిన్న విరామం తీసుకొని కొన్ని ప్రాంతాలకు తప్పకుండా విహారయాత్రకు వెళ్లండి. ట్రిప్ ఏదయినా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు వర్షాకాలంలో మీ అనుభవాన్ని చిరస్మరణీయంగా చేస్తాయి. వర్షాకాలంలోట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. ఈ ప్రదేశాలను మీ లిస్ట్‌లో ఖచ్చితంగా చేర్చుకోండి.
మహాబలేశ్వర్, మహారాష్ట్ర:
వర్షాకాలంలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ అందం రెట్టింపు అవుతుంది. మహాబలేశ్వర్ దాని పచ్చని పర్వతాలు, స్ట్రాబెర్రీ పొలాలు , అద్భుతమైన లోయలకు ప్రసిద్ధి చెందింది. మేఘాలతో కప్పబడిన మార్గాలు, ప్రవహించే జలపాతాలు వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని మరింత అందంగా చేస్తాయి. మీరు ఇక్కడ ఆర్థర్ సీట్, వెన్నా సరస్సు, ప్రతాప్‌గఢ్ కోటను కూడా చూడొచ్చు.
లోనావాలా-ఖండాల, మహారాష్ట్ర:
ముంబై, పూణే సమీపంలో ఉన్న లోనావాలా, ఖండాల హిల్ స్టేషన్లు వర్షాకాలంలో పచ్చదనంతో నిండి ఉంటాయి. ట్రెక్కింగ్, జలపాతాలు , అందమైన లోయలకు వర్షాకాలంలో ఈ ప్రదేశం ఉత్తమమైనది. మీరు లోనావాలా, ఖండాలను సందర్శించబోతున్నట్లయితే.. ఇక్కడ కొన్ని ప్రదేశాలు పర్యాటకులలో ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి. ఇక్కడ భూషి ఆనకట్ట, టైగర్ పాయింట్, రాజ్‌మాచి కోటను తప్పక సందర్శించాలి.
అల్లెప్పీ, కేరళ:
మీరు బ్యాక్ వాటర్స్‌ను చూడాలని అనుకున్నా, వర్షాకాలంలో ప్రత్యేకమైన హౌస్‌బోట్ రైడ్ చేయాలనుకుంటే, కేరళలోని అల్లెప్పీని సందర్శించండి. వర్షపు జల్లులతో ప్రశాంతమైన నీటిలో హౌస్‌బోట్‌లో తేలుతూ ఉండటం ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. వర్షపు చినుకులు పచ్చదనాన్ని మరింత వికసింపజేస్తాయి.
మున్నార్, కేరళ:
కేరళలోని మున్నార్ హిల్ స్టేషన్ టీ తోటలకు ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో టీ తోటల పచ్చదనం రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మేఘాలతో చుట్టుముట్టబడిన పర్వతాలు, ఇక్కడ ప్రశాంతమైన సరస్సులు మంత్రముగ్ధులను చేసే అనుభవాన్ని ఇస్తాయి. ఈ హిల్ స్టేషన్ వర్షాకాలంలో ఫోటో-పర్ఫెక్ట్‌గా మారుతుంది. మున్నార్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఎరవికులం నేషనల్ పార్క్ , మట్టుపెట్టి ఆనకట్ట ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లోని చమోలి ఫ్లవర్స్ వ్యాలీ:
ఆఫ్ ఫ్లవర్స్ అద్భుతమైన అందం కారణంగా యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. జూలై నుండి ఆగస్టు వరకు ఇక్కడ వేలాది రకాల రంగురంగుల పువ్వులు వికసిస్తాయి. ఈ రంగురంగుల పువ్వులను చూడటానికి మీరు వర్షాకాలంలో ఫ్లవర్స్ వ్యాలీని సందర్శించాలి. అలాగే.. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది గొప్ప స్పాట్ అని చెబుతారు.
Also Read: ఆహా.. ఆ దేశంలో అందరికీ ఫ్రీ జర్నీ.. బస్సుల్లోనే కాదు, రైళ్లలో కూడా!
చిరపుంజి, మేఘాయా:
ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఒకటి మేఘాలయలోని చిరపుంజి. అత్యంత వర్షపాతం ఉన్న ప్రదేశం అయినప్పటికీ, వర్షాకాలంలో చిరపుంజి ఆకర్షణ అనేక రెట్లు పెరుగుతుంది. లివింగ్ రూట్ బ్రిడ్జి, జలపాతాలు, గుహలు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. మీరు వర్షాకాలంలో చిరపుంజికి ప్రయాణిస్తుంటే.. మీరు నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, సెవెన్ సిస్టర్స్ జలపాతాలను తప్పక సందర్శించాలి.
కర్ణాటకలోని కూర్గ్:
కాఫీ తోటలకు కూర్గ్ ప్రసిద్ధి చెందింది. అలాగే.. ఇక్కడి పొగమంచు అడవులు, జలపాతాల శబ్దంతో, కూర్గ్ వర్షాకాలంలో ఒక శృంగారభరితమైన విహారయాత్రగా ఉంటుంది. కూర్గ్ సందర్శించేవారు అబ్బే జలపాతం, రాజాస్ సీట్, మండలపట్టి వ్యూ పాయింట్‌లను తప్పక సందర్శించాలి.
కొడైకెనాల్, తమిళనాడు:
దీనిని “హిల్ స్టేషన్ల యువరాణి” అని పిలుస్తారు. కొడైకెనాల్ అడవులు, ప్రశాంతమైన సరస్సులు వర్షా కాలంలో ఆకర్షణీయంగా ఉంటాయి. కోడై సరస్సు, బ్రయంట్ పార్క్ , సిల్వర్ జలపాతం వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.