BigTV English

Samantha: సమంత లేటెస్ట్ పోస్ట్.. శోభితా, నాగచైతన్యకు సీక్రెట్ మెసేజ్.?

Samantha: సమంత లేటెస్ట్ పోస్ట్.. శోభితా, నాగచైతన్యకు సీక్రెట్ మెసేజ్.?

Samantha: ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వర్కవుట్ అవ్వక విడిపోవడం లాంటివి బయట కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఇలా జరిగినప్పుడే ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం మత్రం ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇద్దరూ హీరోహీరోయిన్లు అవ్వడం, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవడంతో అసలు అలా ఎలా విడిపోయారు అని ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా నాగచైతన్య సినిమా ‘తండేల్’ కోసం శోభితా కూడా ప్రమోషన్స్ చేస్తుండగా.. సమంత ఒక పోస్ట్ షేర్ చేసింది. అది వారిద్దరికీ ఇన్‌డైరెక్ట్ కౌంటర్ లాగానే ఉందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.


సీక్రెట్ మెసేజ్.?

నాగచైతన్య ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా హిట్ అవ్వాలని దేవాలయాలకు వెళ్లి మొక్కుకునేది సమంత. ఇప్పుడు తన స్థానంలోకి శోభితా వచ్చింది. నాగచైతన్య, శోభితా పెళ్లి తర్వాతే చైతూ హీరోగా నటించిన ‘తండేల్’ విడుదలయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. తన భర్త కష్టాన్ని ప్రేక్షకులకు తెలియడం కోసం శోభితా కూడా ప్రమోషన్స్‌లోకి ఎంటర్ అయ్యింది. ‘తండేల్’ అనే టైటిల్‌తో టీషర్ట్ ధరించి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా ఈ సినిమాకు మొదటి రివ్యూ ఇచ్చి మురిసిపోయింది. ఇదంతా జరుగుతుండగా సమంత షేర్ చేసిన ఒక కోట్.. నాగచైతన్య, శోభితా (Sobhita)కు సీక్రెట్ మెసేజ్ అందించినట్టుగా ఉందని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


మారుతూ ఉంటారు

‘ఒక మనిషిగా నువ్వు కేవలం జీవించడం లేదు. నువ్వు మారుతూ ఉన్నావు. ఇది ఎప్పటికీ జరిగే ప్రక్రియ. ఏదీ శాశ్వతం కాదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు’ అంటూ ఒక కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సమంత. దీన్ని బట్టి చూస్తే ఇది నాగచైతన్య, శోభితాను ఉద్దేశించి పెట్టినట్టుగా ఉందే అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. ఇటీవల ‘తండేల్’ (Thandel) ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్య.. మొదటిసారి సమంతతో విడాకుల గురించి పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో తను చేసిన వ్యాఖ్యలు వెంటనే వైరల్ అయ్యాయి. ఇంతలోనే సమంత ఇలా కోట్ షేర్ చేయడంతో నాగచైతన్య ఇంటర్వ్యూతో దానిని కనెక్ట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు.

Also Read: త్రిష ట్విటర్ అకౌంట్ హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

డైరెక్ట్‌గా స్పందించలేదు

నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) విడాకులు తీసుకొని దాదాపు మూడున్నర ఏళ్లు అయ్యింది. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత కూడా చాలాకాలం పాటు వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని ఫ్యాన్స్‌లో ఆశ మాత్రం పోలేదు. అలా కొన్నాళ్ల తర్వాత శోభితాతో నాగచైతన్య ప్రేమ వ్యవహారం బయటపడింది. అయినా అది నిజం కాదేమో అని చాలామంది ప్రేక్షకులు నమ్మలేదు. కానీ అదే నిజమయ్యింది. నాగచైతన్య, శోభితా ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ పెళ్లి సమయంలో సమంత పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. కానీ తను మాత్రం దేనికీ నేరుగా స్పందించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×