BigTV English

Trisha: త్రిష ట్విటర్ అకౌంట్ హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

Trisha: త్రిష ట్విటర్ అకౌంట్ హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

Trisha: టెక్నాలజీ పెరిగినప్పటి నుండి దానివల్ల సినీ సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు. సినీ సెలబ్రిటీలు తప్పకుండా తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండాలి. వారి ప్రొఫెషనల్ అప్డేట్స్ అందరితో పంచుకోవాలన్నా.. వారి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలన్నా సోషల్ మీడియా కావాల్సిందే. కానీ ఆ సోషల్ మీడియా వల్లే వారు పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం, వాటి నుండి సమాచారం అంతా లీక్ అవ్వడం లాంటివి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ త్రిష ట్విటర్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా బయటపెట్టింది.


కామన్ అయిపోయింది

త్రిష సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ తన టీమే చూసుకుంటుంది. అలా తాజాగా తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ‘నా ట్విటర్ హ్యాక్ అయ్యింది. నేను చెప్పేవరకు ఆ పోస్టులను పట్టించుకోవద్దు. థాంక్యూ’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అప్పటికే తన ట్విటర్ హ్యాండిల్‌లో సంబంధం లేని పోస్ట్ ఏదో షేర్ అయ్యి ఉంది. దీంతో వెంటనే తన టీమ్ అలర్ట్ అయ్యి త్రిష ట్విటర్ అకౌంట్‌ను హ్యాకర్స్ నుండి కాపాడింది. ప్రస్తుతం అంతా ఓకే అయిపోయింది. అయినా హీరోహీరోయిన్ల ట్విటర్లు, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అవ్వడం. మళ్లీ వెంటనే మామూలు అయిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది.


భారీ డిశాస్టర్

మామూలుగా హీరోహీరోయిన్ల సోషల్ మీడియా అకౌంట్సే సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అవుతుంటాయి. కానీ అంత ఈజీగా వీరి అకౌంట్స్ ఎలా హ్యాక్ అవుతున్నాయనే విషయం మాత్రం తేలడం లేదు. మొత్తానికి త్రిష క్లారిటీ ఇచ్చిన కాసేపట్లోనే తన ట్విటర్ మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే.. చివరిగా అజిత్ హీరోగా నటించిన ‘విడాముయర్చి’లో హీరోయిన్‌గా కనిపించింది త్రిష. ఇదే సినిమాను ‘పట్టుదల’ పేరుతో తెలుగులో కూడా డబ్ చేశారు. కానీ ఈ సినిమా అటు తమిళంలో, ఇటు తెలుగులో.. రెండు భాషల్లోనూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అజిత్ కెరీర్‌లోనే భారీ డిశాస్టర్‌గా నిలిచింది.

Also Read: రామ్ చరణ్ విషయంలో చిరంజీవి టెన్షన్.. ఈసారి అదే జరిగితే…

టాలీవుడ్ రీఎంట్రీ

త్రిష (Trisha) కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా తెలుగు సినిమాల్లో నటించడం, డబ్ అయిన తమిళ చిత్రాలలో కనిపించడంతో తను తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యింది. కానీ తను తెలుగు సినిమాలో నటించడం మాత్రం చాలాకాలమే అయ్యింది. చివరిగా 2016లో విడులదయిన ‘నాయకి’తో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది త్రిష. అప్పటినుండి ఇప్పటివరకు మరొక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అందుకే వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’తో టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ‘విశ్వంభర’లో చిరంజీవి, త్రిష కెమిస్ట్రీ చూడడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినా విడుదల తేదీపై మాత్రం క్లారిటీ లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×