BigTV English

Samantha : బాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Samantha : బాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha) పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఏం మాయ చేసావే అంటే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ఈ మధ్య తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సామ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. తాజాగా మరోసారి ఆమె స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం..


తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన సమంత జీవితంలో ఒకదాని వెంట మరొకటి సమస్యలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, ఆ తర్వాత సినిమాలు. అయితే నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న సమంత మయోసైటిస్ కు గురవడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది.. ఇప్పుడు మాత్రం మరో తోడు కోసం చూస్తుందని ఆకాంక్షిస్తుందట. గత కొన్ని రోజులుగా ఈమె పెళ్లి గురించి రకరకాల వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. బాలీవుడ్ బడా హీరో ఇంటికి కోడలుగా రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

Also Read : బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కలెక్షన్ల మోత మోగిపోతుంది..


బాలీవుడ్ హీరోతో ప్రేమాయణంలో ఉందని, త్వరలోనే ఆ హీరోను వివాహం చేసుకొని వారి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టబోతోందనేది ఆ వార్త సారాంశం. ఆ హీరో ఎవరో కాదు.. ఇటీవలి వరకు మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిన అర్జున్ కపూర్. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొడుకైన అర్జున్ కపూర్ ఇటీవలే మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పాడు. సమంతను పెళ్లి చేసుకోవడానికి అతను ఆమెకు బ్రేకప్ చెప్పాడని ప్రస్తుతం వార్తలయితే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సమంత తన అకౌంట్ లో ఓ మంచి కవితను షేర్ చేసింది. దీనికి అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య అంతకుముందే అంత మంచి సాహిత్యం ఉందా లేక నిజంగానే ప్రేమలో పడ్డారా అనేది మాత్రం తెలియలేదు కానీ అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. ఇక నిన్న మొన్నటి వరకు సమంతా ఓ డైరెక్టర్ ప్రేమలో మునిగితేలుతుందని వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే సమంత క్లారిటీ ఇవ్వాల్సిందే..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×