E-Paper
Advertisement

Horoscope  Today February 16th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి

Horoscope  Today February 16th: ఆ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 16న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వ్యాపారాల ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది.

Advertisement

వృషభం: మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.

మిధునం: వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగంలో అదనపు భాధ్యతలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

Advertisement

కర్కాటకం: ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది.

కన్య: ధన వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తుల: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఉద్యోగస్తులు పై అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృశ్చికం: వ్యాపారంలో భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.

ధనస్సు: ఉద్యోగంలో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మకరం: ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.

కుంభం: ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం: కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×