BigTV English

OTT Movie : పెళ్లి చేసుకోవట్లేదని కజిన్ కి చేతబడి చేపించే తింగరబుచ్చి

OTT Movie : పెళ్లి చేసుకోవట్లేదని కజిన్ కి చేతబడి చేపించే తింగరబుచ్చి

OTT Movie : చేతబడి అంటే ఇప్పటికీ వణికి పోతూ ఉంటారు చాలామంది మనుషులు. వీటి కారణంగా ఎంతో మందిని బ్రతికుండగానే తగలబెట్టేసారు కూడా. అవి ఉన్నాయో లేదో తెలియదు కానీ, మనుషులు చేసే హడావిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒక చేతబడి కాన్సెప్ట్ తో వచ్చింది. పెళ్లికి ఒప్పుకోలేదని సొంత కజిన్ కి చేతబడి చేస్తుంది హీరోయిన్. వీళ్ళిద్దరి చుట్టూ, మధ్యలో వచ్చే దయ్యాల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (YouTube) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సిజ్జిన్’ (The Sijjin). 9 నవంబర్ 2023 రిలీజ్ అయిన ఈ ఇండోనేషియన్ మూవీకి హద్ర దీంగ్ రతు దర్శకత్వం వహించారు. ఒక గంట 40 నిమిషాలు నిడివి ఉండే ఈ మూవీ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ తన కజిన్ ని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటానని కూడా అడుగుతుంది. అయితే కజిన్తో పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎలాగైనా చేతబడి చేసిన తనని సొంతం చేసుకోవాలనుకుంటుంది హీరోయిన్. ఈ క్రమంలోని ఒక మంత్రం గాడి దగ్గరికి తన చెల్లెల్ని తీసుకొని వెళుతుంది. ఆ మంత్రగాడు చేతబడి చాలా ప్రమాదకరమని, మీరు తట్టుకోలేరని చెప్తాడు. ఇంతలో ఒక ఆత్మ చెల్లెలుకు ఆవహించి, ఆత్మలంటే మీకు ఆటగా ఉందా అంటూ హీరోయిన్ కి చెప్తాయి. అక్కడినుంచి భయపడి హీరోయిన్ వచ్చేస్తుంది. అలా కజిన్ కి కూడా వేరే అమ్మాయితో పెళ్లి అయిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు అనుకోకుండా వీళ్ళు కలుస్తారు. అప్పటికే కజిన్ మీద ప్రేమతో పెళ్లి చేసుకోకుండానే ఉంటుంది హీరోయిన్. ఈసారి వాళ్లను చూసి తన కజిన్ ని ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకుంటుంది హీరోయిన్. మళ్లీ చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళుతుంది.

ఈసారి చేతబడి ఖచ్చితంగా చేయాలని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి నీ మీద కూడా చేతబడి చెపిస్తానని అంటుంది. తన దగ్గర ఉన్న బంగారంను కూడా అతనికి ఇచ్చేస్తుంది. అయితే మంత్రగాడు వాళ్ళ వెంట్రుకలు తీసుకు రమ్మంటాడు. ఎందుకంటే హీరోయిన్ చేతబడి ద్వారా మొదట కజిన్ భార్యని చంపాలనుకుంటుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వాళ్ళ వెంట్రుకలను మంత్రగాడికి తెచ్చిస్తుంది. ఆ మంత్రగాడు మంత్రాన్ని చదివి దయ్యాలకు విషయం చెప్పి పంపిస్తాడు. చివరికి ఆ దయ్యాలు వాళ్లను ఏం చేస్తాయి? హీరోయిన్ తన కజిన్ ను పెళ్లి చేసుకుంటుందా ? చేతబడి విజయవంతం అవుతుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది సిజ్జిన్’ (The Sijjin) అనే ఈ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×