BigTV English

Samantha : మ‌యోసైటిస్‌కు స‌మంత ఐవీఐజీ ట్రీట్‌మెంట్‌

Samantha : మ‌యోసైటిస్‌కు స‌మంత ఐవీఐజీ ట్రీట్‌మెంట్‌

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం మియో సైటిస్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో స‌మంత సినిమా షూటింగ్‌కు కూడా దూర‌మైంది. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింది. దీంతో ఆమె షూటింగ్స్‌లో మ‌ళ్లీ పాల్గొంటున్నారు. అయితే ఆమెకు మియోసైటిస్ పూర్తిగా న‌యం కాలేదు. దీంతో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే వ్యాయామాలు చేస్తున్నారు. ఆమె ప్ర‌స్తుతం నెల‌వారీగా ఇంట్రావీన‌స్ ఇమ్యూనోగ్లోబ‌ల్ థెర‌ఫీ (ఐజీఐవీ) ట్రీట్మెంట్‌ను తీసుకుంటుంది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టాలో షేర్ చేశారు. దాంతో పాటు న్యూ నార్మ‌ల్ అనే కామెంట్‌ను కూడా పోస్ట్ చేశారు.


ఇంత‌కీ ఐజీఐవీ థెర‌ఫీ ఎంద‌కు చేయించుకుంటారో తెలుసా! శ‌రీరంలో బ‌ల‌హీన ప‌డిన ఇమ్యూనిటీని తిరిగి ప‌ని చేయించుకోవ‌టంతో పాటు ఇత‌ర వ్యాధుల కారణంగా ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డ‌కుండా చూసుకుంటుంది. అయితే దీని కోసం రెండు నుంచి నాలుగు గంట‌ల స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. ఈ థెర‌ఫీని స‌మంత ఇంట్లో నుంచే తీసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే ఎక్స‌ర్‌సైజును చేస్తున్నారు స‌మంత‌. సామ్ ఫొటో చూసిన ఆమె ఫ్యాన్స్ త్వ‌ర‌గా త‌మ అభిమాన క‌థానాయిక కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

ప్ర‌స్తుతం సినిమాల షూటింగ్‌ను స్టార్ట్ చేసిన స‌మంత… రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో సిటాడెల్ సిరీస్‌లో న‌టిస్తుంది. దీని త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండతో ఖుషి సినిమా చేయ‌బోతుంది. మ‌రో వైపు స‌మంత న‌టించిన పాన్ ఇండియా మూవీ శాకుంత‌లం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×