BigTV English

ChatGPT : ‘బింగ్‌’లో చాట్‌జీపీటీ.. వాడాలంటే వేచి ఉండాల్సిందే!

ChatGPT : ‘బింగ్‌’లో చాట్‌జీపీటీ.. వాడాలంటే వేచి ఉండాల్సిందే!

ChatGPT : ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీ సేవల్ని లైవ్‌లోకి తీసుకొచ్చింది… మైక్రోసాఫ్ట్. ఇకపై సెర్చ్ ఇంజిన్ ‘బింగ్‌’లోనే ఎంచక్కా చాట్‌జీపీటీని వాడొచ్చని చెబుతోంది. వినియోగదారులందరికీ ‘బింగ్‌’లో చాట్‌జీపీటీని అందుబాటులోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్… ప్రస్తుతానికి ‘వెయిట్ లిస్ట్’ పద్ధతిలో యూజర్లను అనుమతిస్తోంది. చాట్‌జీపీటీని యాక్సెస్‌ చేయాలనుకుంటే ముందు వెయిట్‌ లిస్ట్‌లో చేరాలి. వినియోగదారుడి వంతు వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్‌ నుంచి అతనికి సమాచారం వెళ్తుంది. అప్పుడు డెస్క్‌టాప్‌లో చాట్‌జీపీటీ సేవలు పొందవచ్చు. అయితే మొబైల్‌ వెర్షన్లో ఎప్పటి నుంచి చాట్‌జీపీటీ సేవలు ఉంటాయనే దానిపై మైక్రోసాఫ్ట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


వెయిట్‌లిస్ట్‌లో చేరాలంటే డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో ఎడ్జ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి… అడ్రస్‌ బార్‌లో bing.com అని సెర్చ్‌ చేయాలి. అప్పుడు ఒక చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ask me anything అన్న ఆప్షన్ దిగువన నాలుగు డమ్మీ ప్రశ్నలు కనిపిస్తాయి. వాటి కింద ఉన్న Try it అనే బటన్‌ను క్లిక్‌ చేస్తే… పైన ఉన్న ప్రశ్నలకు సమాధానం వస్తుంది. కుడివైపున ఓ చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ అయ్యాక… దాని దిగువన Join the waitlist అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే మైక్రోసాఫ్ట్ మెయిల్‌ లాగిన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు ఎంటర్ చేస్తే… నిరీక్షణ జాబితాలో చేరినట్లు సందేశం కనిపిస్తుంది. ఆ యూజర్ వంతు వచ్చాక… చాట్‌జీపీటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని మెయిల్‌కు సమాచారం వస్తుంది. అప్పుడు ఆ యూజర్ చాట్‌జీపీటీ సేవల్ని పొందవచ్చు. బింగ్‌ ద్వారా అందుబాటులో ఉండే చాట్‌జీపీటీ సేవలు ఎలా ఉంటాయో… కొన్ని ఉదాహరణల ద్వారా చూపుతోంది… మైక్రోసాఫ్ట్. అవి దాదాపు చాట్‌జీపీటీ తరహాలోనే ఉన్నాయి. చాట్‌జీపీటీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాకే… దాని పూర్తి ఫీచర్లు తెలుస్తాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×