E-Paper
Advertisement

Agriculture : వ్యవసాయంలో నీటి సమస్యకు చెక్..!

Agriculture : వ్యవసాయంలో నీటి సమస్యకు చెక్..!
Advertisement

Agriculture : వ్యవసాయంపై ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నా.. దాన్నే నమ్ముకొని ఉన్న రైతుకు మాత్రం అడుగడుగునా కష్టాలే ఎదురవుతూ ఉంటాయి. అందుకే వారి భారాన్ని తగ్గించడానికి ఇప్పటికే ఎంతో టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టి.. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు. అయినా మరికొన్ని ఇబ్బందులు వారిని కలవరపెడుతున్నాయి. అందులో ఒకటే నీటి సమస్య.

వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టంగా మారింది. ఎప్పుడు ఉన్నట్టుండి వర్షం పడుతుందో.. ఎప్పుడు ఒక్కసారిగా ఎండలు ఎక్కువవుతాయో.. అంచనా వేయడం కష్టమయిపోయింది. అందుకే పంటకు నీటి విడుదల విషయంలో రైతులు అయోమయంలో పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కాస్ట్) శాస్త్రవేత్తలు ఒక మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌ (మాఫ్)ను తయారు చేశారు.

Advertisement

వ్యవసాయ నిర్వహణను ప్రణాళిక ప్రకారం చేస్తే.. అది పంట క్వాలిటీని పెంచుతుంది. అంతే కాకుండా ఈ ప్రక్రియలో వచ్చే ఎన్నో ఖర్చులను తగ్గిస్తుంది, నీటిని కూడా సరిగా వినియోగించేకునే అవకాశం అందిస్తుంది. నీటిని పంటకు వదలకపోయినా.. పొలంలోని భూమి ఎంత తడిగా ఉండాలి అనేదాన్ని గమనిస్తే.. నీటి సమస్య వల్ల పంట పాడయిపోవడం లాంటి సమస్యలు ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికోసమే మాఫ్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

సాయిల్ మాయిశ్చర్‌ను కనిపెట్టడానికి మాఫ్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఒక పంజరం లాంటి పరికరం లాగా ఉండి.. ఇందులో నీటిలాంటి అణువులను నిల్వ ఉంచడానికి వినియోగించవచ్చు. ఈ సెన్సార్‌ను పోడి భూమిలో పెట్టడం ద్వారా మాఫ్‌లో ఉండే గాలిని నీటిలాగా మార్చి భూమిని తడి చేస్తుంది. ఎంతవరకు నీటిని వదిలాలి అన్న విషయాన్ని రైతులు గమనిస్తూ ఉండవచ్చు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×