BigTV English

Spirit Movie : ప్రభాస్‌కు వంగా మరిన్ని కండిషన్స్… ఫాలో అవ్వకుంటే దీపికాలానే…?

Spirit Movie : ప్రభాస్‌కు వంగా మరిన్ని కండిషన్స్… ఫాలో అవ్వకుంటే దీపికాలానే…?

Spirit Movie : సందీప్ రెడ్డి వంగా సినిమాలే కాదు.. ఆయన కూడా చాలా వైలైంట్. కొంత మంది అయితే… సందీప్ రెడ్డితో మాట్లడటానికే భయపడుతారని.. చాలా సందర్భాల్లో వాళ్లే స్వయంగా చెప్పారు. ఓ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అన్నాడు.


నార్మల్‌గా సీరియస్‌గా ఉన్నట్టే… సినిమా సెట్స్‌లోనూ అలానే ఉంటారట. సినిమా అవుట్ పుట్ వచ్చే వరకు అలాంటి సీరియస్‌నెస్‌తోనే ఉంటారు. అంతే కాదు… ఆయన సినిమాల్లో చేసే నటీనటులకు స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతూ ఉంటాడు. చివరికి హీరో, హీరోయిన్స్ కూడా ఆ కండిషన్స్ వర్తిస్తాయి.

ఆ కండిషన్స్ తట్టుకోలేకే… ఇటీవల స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్ దీపికా పదుకుణె తప్పుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు స్పిరిట్ హీరో ప్రభాస్ కు కూడా సందీప్ రెడ్డి వంగా కండిషన్స్ పెడుతున్నాడట. కండిషన్స్ పెట్టడమే కాదు… అవి స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే అని కూడా చెబుతున్నాడట.


మొన్న ఆ మధ్య ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కొన్ని కండిషన్స్ పెట్టాడు అంటూ కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కు మరి కొన్ని కండిషన్స్ పెట్టాడట వంగా. ఇటీవల ఇటలి టూర్ నుంచి వచ్చిన ప్రభాస్‌కు ఈ కండిషన్స్ గురించి చెప్పాడట.

మరిన్ని కండిషన్స్..

ప్రస్తుతానికి స్పిరిట్ మూవీ షూటింగ్ కోసం ప్రభాస్ ను 30 రోజుల కాల్ షీట్స్ ఇవ్వమని కోరాడట. ఈ 30 రోజులు పూర్తిగా స్పిరిట్ కోసమే కేటాయించాలి అని అన్నారట. అంతే కాదు… ఈ 30 రోజులు డే అండ్ నైట్ ఎప్పుడూ షూటింగ్ ఉన్నా.. తప్పకుండా రావాల్సిందేనని కండిషన్ పెట్టాడట.

అలాగే, ప్రభాస్‌కు ఇద్దరు డూప్‌లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్పిరిట్ సినిమాకు ఆ ఇద్దరిని వీలైనంత దూరంగా పెట్టాల్సిందే అని చెప్పాడట. అంటే.. డూప్ లేకుండా సినిమా చేయాలని ప్రభాస్‌ను కోరినట్టు సమచారం.

వీటితో పాటు మరి కండిషన్స్ కూడా పెట్టాడట. స్పిరిట్ స్టోరీ నెక్ట్స్ లెవెల్ ఉండటం, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ పై నమ్మక ఉండటతో… సందీప్ పెట్టిన కండిషన్స్ అన్నింటికీ డార్లింగ్ ఒకే అని చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×