KTR on Kavitha’s Letter: మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుందాం. మా పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ కవితను ఉద్దేశించి మాట్లాడారు.
సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు కావాలంటే తెలంగాణ నుంచి తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై పలు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా పేరుతో వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈడీ ఛార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించరని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read: మాట మార్చిన హరీష్.. మరి కవిత లెక్కలేంటి?
ఆర్ఆర్ ట్యాక్స్‌పై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని స్కాంలు జరుగుతున్న కేంద్రం ఎందుకు స్పందించటం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న స్కాంల పై నెల రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా చూస్తాం. స్పందించకపోతే తమ పార్టీలో చర్చించి కార్యాచరణ చేపడతాం అన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి.. శని కాంగ్రెస్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు కేటీఆర్.
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం హాస్యాస్పద మన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కేసీఆర్ కుటుంబంలో వర్గ పోరు ఎప్పటినుంచో మొదలైందన్న ఆయన.. కాళేశ్వరం అక్రమాల విచారణ టాపిక్‌ను డెవర్ట్ చేసేందుకే తెరపైకి లేఖ తెచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన పనిచేసే సంతోష్ రావు వ్యూహంలో భాగమే ఈ లెటర్ అని, తండ్రి కూతురుల మధ్య లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాగరాజు.