Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మూవీ.. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఒకవైపు సినిమా సక్సెస్ అయిందన్న సంతోషం అల్లు అర్జున్ కు లేదు.. ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయితే పర్మిషన్ లేకుండా థియేటర్ కు రావడంతోనే ఘటన జరిగిందనే పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. బెయిల్ పై బయటకు వచ్చాడు. కానీ ఈ వివాదం మాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ కు నెంబర్ 11 గండం పట్టుకుందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అసలు ఈ నెంబర్ 11 గండం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
సంధ్య థియేటర్ ఘటన..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తుందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పు చేశారని కొన్ని సిసీ టీవీ పుటేజ్ ను చూస్తే తెలుస్తుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల బెనిఫిట్ షోలు తీసివేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం బాంబ్ పేల్చింది. ఇక అల్లు అర్జున్ చుట్టు వివాదాలు చుట్టుకున్నాయి. బెయిల్ వచ్చిందని సంతోషపడేలోపు మరొకటి వచ్చి పలకరిస్తుంది. అల్లు అర్జున్ ను వెంటాడుతున్న సమస్యలకు కారణం నెంబర్ 11 అని అంటున్నారు. అసలు ఆ గండం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు అర్జున్ ను వెంటాడుతున్న నెంబర్ 11..
అల్లు అర్జున్ కు ఒక గండం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మే 11 న నంద్యాల శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి అతన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. మెగా ఫ్యామిలీతో విడిపోయాడు. ఆ తర్వాత ఒక్కో వివాదం అతన్ని వెంటాడుతుంది. ఇక ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆయన్ను 11 న అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయన్ను పోలీసులు 11 గంటలకే విచారించారు. ఇవన్నీ చూస్తుంటే 11 గండం నిజమే అని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని. అందుకే ఈ వివాదాలు వస్తున్నట్లు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణు స్వామి..కలియుగంలో డబ్బు ఎక్కడుంటే రిస్క్ అక్కడ ఉంటుందని తెలిపారు. అది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఎవరూ కావాలనుకొని చేసింది కాదన్నారు వేణు స్వామి. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాలేదు…ఆ తర్వాత బాగుందని వెల్లడించారు వేణు స్వామి. జాతకాలను బట్టి అన్ని జరుగుతాయని కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 29 వరకు ఇలాంటి వరుస సమస్యలు ఆయనను వెంటాడుతాయని వేణు స్వామి అంటున్నారు.. అంతేకాదు అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి గ్యాప్ తీసుకుంటున్నాడు. మరి మార్చి తర్వాత అయిన అల్లు అర్జున్ కు అంతా సెట్ అవుతుందేమో చూడాలి.