BigTV English

TTD Member Bhanu Prakash: పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్

TTD Member Bhanu Prakash: పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్

TTD Member Bhanu Prakash: నిత్యం వార్తల్లో నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈసారి పరకామణి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ యవ్వారంపై కచ్చితంగా ఎంక్వైరీ వేసి అసలు దొంగలను పట్టుకోవాలన్నది ప్రధాన డిమాండ్. ఇంతకీ పరకామణి వ్యవహారం ఏంటి? ఏం జరిగింది? ఇంకా డీటేల్స్‌లోకి వెళ్తే..


తిరుమలలో జరిగిన లీలలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. అక్కడి ఓ ఉద్యోగి కన్ను శ్రీవారి హుండీపై పడింది. ఆ వ్యక్తి పెద్ద జియ్యంగార్ తరపున పని చేశాడట. ఏళ్ల తరబడి శ్రీవారి పరకామణిలో ఫారెన్ కరెన్సీ, నగలు  కొల్లగొట్టాడు. అతడ్ని పట్టుకున్న అధికారులు, అతడితో రాజీ పడినట్టు తెలుస్తోంది. చివరకు దొంగిలించిన మనీ ద్వారా కూడబెట్టిన ఆస్తులను కొంతమంది అధికారులు రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కరోనా సమయంలో జరిగిన ఈ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా, ఇప్పుడు తారాస్థాయికి చేరింది. 2020-23 సమయంలో బంగారాన్ని ఎలాగైతే స్మగర్లు అక్రమ రవాణా చేస్తున్నారో, ఆ విధంగా శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీ(డైమండ్స్, అమెరికన్ కాయన్స్)ని నొక్కేశాడట సదరు ఉద్యోగి. హండీకి వచ్చిన డాలర్లను మూడో కంటికి తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా దొంగలించాడు. సిబ్బంది చెక్ చేసినా ఎక్కడా దొరికేవాడు కాడట.


దొంగతనం చేసిన తర్వాత కడుపులో ఉన్న సొత్తును చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వాటిని తొలగించుకుని  వచ్చేవాడని చెబుతున్నారు. దొంగిలించిన డబ్బుతో భారీగా ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. చివరకు విజిలెన్స్ అధికారులకు ఆ వ్యక్తి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఇంటిగుట్టు బయటపడింది. విజిలెన్స్‌లో సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు.

ALSO READ:  తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఈ తేదీలు గుర్తుంచుకోవాల్సిందే!

పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. కొందరు టీటీడీ అధికారులు పోలీసులతో కుమ్మక్కై డీల్ సెట్ చేసుకున్నారన్నది ఫస్ట్ పాయింట్. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేయకుండా ఈ వ్యవహారాన్ని లోక్ అదాలత్‌కు తీసుకెళ్లారు. ఆయన దొంగలించిన ఆస్తుల్లో 70 లేదా 80 కోట్ల రూపాయలను టీటీడీకి విరాళం ఇచ్చినట్టు చేశారు.

అసలు కథ ఇక్కడే మొదలైంది. శ్రీవారికికి వచ్చిన డైమండ్స్, బంగారం రూపంలో వచ్చిన కానుకల విలువ దాదాపు 90 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. ఓవరాల్‌గా 200 కోట్ల రూపాయల కానుకలు నొక్కేశాడు. ఆ మొత్తాన్ని కొందరు టీటీడీ అధికారులు, పోలీసులు, కొందరు వైసీపీ నేతలు రాయించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిగిపించాలన్నది టీటీడీ బోర్డు భాను ప్రకాష్ ప్రధాన డిమాండ్.

ఈ వ్యవహారాన్ని టీటీడీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారాయన. ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటున్నారు. పరకామణి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×