E-Paper
Advertisement

Shoaib Akhtar: అల్లా మీద ఒట్టు.. పాకిస్తాన్ ఫైన‌ల్స్ చేరుతుంది, ఇండియాను చిత్తుగా ఓడిస్తుంది

Shoaib Akhtar: అల్లా మీద ఒట్టు.. పాకిస్తాన్ ఫైన‌ల్స్ చేరుతుంది, ఇండియాను చిత్తుగా ఓడిస్తుంది
Advertisement

Shoaib Akhtar:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. మరో రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకోవాల్సి ఉంది. ఈ రెండు స్థానాల కోసం ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా తలపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్త‌ర్ ( Shoaib Akhtar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరాలని.. ఆ తర్వాత ఫైనల్ కు వెళ్లాలని వెల్లడించారు. అల్లా పైన నమ్మకం ఉందని.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కచ్చితంగా ఫైనల్ జరుగుతుందని కూడా ధీమా వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్త‌ర్. ఇక ఈ ఫైన‌ల్స్ లో ఇండియాను ( Team India) పాక్ ( Pak) ఓడిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేరకు శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శ‌ర్మకు ఘోర అవ‌మానం…చెప్పులు చూపించిన యువ‌రాజు

పాకిస్తాన్ ఫైన‌ల్స్ చేరుతుంది, ఇండియాను చిత్తుగా ఓడిస్తుంది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప‌ల్లెకేలే ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా శనివారం మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో శ్రీలంక పై పాకిస్తాన్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం పాకిస్తాన్ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. శ్రీలంకపై ఈ మ్యాచ్ లో 64 నుంచి 70 పరుగుల మధ్య తేడాతో పాకిస్తాన్ గెలవాలి. అప్పుడే సెమీ ఫైనల్ కు చేరుతుంది పాకిస్తాన్. ఇక అటు ఇండియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సెమీ ఫైనల్ కు వెళుతుంది. అప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండు సెమి ఫైనల్స్ జరుగుతాయి. ఇందులో ఇండియా అలాగే పాకిస్తాన్ గెలిస్తే.. ఫైనల్ కు చేరుతాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్త‌ర్‌ వెల్లడించారు. ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్లి ఆ తర్వాత ఫైనల్స్ లో తలపడతాయని వెల్లడించారు. అల్లా అండతో ఇది కచ్చితంగా జరుగుతుందని వివరించారు. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటేనే మజా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఫైన‌ల్స్ లో ఇండియాను పాక్ ఓడిస్తుంద‌ని శ‌ప‌థం చేశారు అక్త‌ర్‌.

Also Read: Rinku Singh’s father dies: రింకూ ఇంట విషాదం..టీమిండియా ప్లేయ‌ర్లకు అసలు సిగ్గుందా..రీల్స్ చేస్తూ చేస్తారా?

Advertisement

 

 

Related News

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

Big Stories

Advertisement
×