Sankranthi ki vasthunnam.. విక్టరీ వెంకటేష్ (Venkatesh )హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకుడిగా రాబోతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇప్పటికే ఈ కాంబినేషన్లో ‘ఎఫ్2’ , ‘ఎఫ్3’ సినిమాలు వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో కాస్త క్రైమ్ జోడించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సినిమా సెట్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని డైరెక్టర్ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా జస్ట్ లో ఆ నటుడు ఎస్కేప్ అయినట్టు సమాచారం. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.
నటుడి తలపై గన్ గురిపెట్టిన అనిల్ రావిపూడి..
తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన, అనగా సంక్రాంతి పండుగ రోజు విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దిల్ రాజు (Dilraju) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రెస్ మీట్ లో భాగంగా అనిల్ రావిపూడి(Anil Ravipudi)మాట్లాడుతూ వీటీవీ గణేష్ (VTV Ganesh) తో సెట్ లో జరిగిన సంభాషణను తెలుపుతూ.. ఈయన నా చేతుల్లో క్షణాల్లో చనిపోయేవారు.. ఆయన ఆపకపోయి ఉండి ఉంటే, అంటూ తెలిపారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయం చెప్పిన అనిల్ రావిపూడి..
స్టేజ్ పైకి వీటీవీ గణేష్ (VTV Ganesh) ని తీసుకొచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఈయన అమ్మ.. గన్ అంటే ఏంటో తెలుసా నీకు..? అని అడిగాడు”..అంటూ అనిల్ చెప్పడం ప్రారంభించగానే.. గణేష్..”అయ్యయ్యో” అంటూ అప్పుడే తన డైలాగ్ చెప్పడం మొదలు పెట్టాడు. వెంటనే అనిల్ రావిపూడి ఆపేసి, “సార్ ఇప్పుడు నన్ను మాట్లాడినివ్వండి” అంటూ తెలిపాడు. అనిల్ మాట్లాడుతూ.. “గన్ ఏముంది సర్ అని అన్నాను.. కానీ ఆయన రియల్ గన్ అంటే ఏంటో తెలుసా? అని అడిగారు. దీంతో వెంటనే నా పక్కనున్న నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది. ఆ విషయం మాకు తెలియదు. అది రియల్ గన్ అని. నేను అడగానే ఆయన సూట్ కేస్ నుంచి తెప్పించారు. అది చూడడానికి చాలా చిన్నగా ఉంది. కేవలం రెండేళ్ల వెడల్పు, పొడవు మాత్రమే ఉంది. నరేష్ గారు నా చేతికి ఇచ్చారు. అయితే అది రియల్ గన్ను. కానీ నేను బొమ్మ గన్ అనుకొని ధైర్యంగా చేతుల్లోకి తీసుకున్నాను. వెంటనే గణేష్ గారి తలపైన పాయింట్ చేసి పెట్టాను. ఇక వెంటనే నరేష్ గారు కంగారు పడిపోయి, ఏయ్ ఆపు అంటూ నన్ను లాగుతున్నారు.. ఉండండి సార్ అంటూ నేను ఆయన ఫోర్ హెడ్ పైన పాయింట్ చేశాను. తర్వాత వెంటనే నరేష్ గారు నా చేతిలో నుంచి గన్ లాగేసి, మ్యాగజైన్ తీసి సరికి అందులో బుల్లెట్స్ ఉన్నాయి. అది టచ్ అంట. అలా టచ్ చేయగానే బుల్లెట్ వెళ్లిపోతుందట. నాకు తెలియదు.. ఒక్క టచ్ తో ఆయన ప్రాణం పోయేది. ఒక్క సెకండ్లో ఆయన తప్పించుకున్నారు.. ఇదీ సెట్ లో జరిగింది. సార్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది” అంటూ అసలు విషయాన్నీ తెలిపారు అనిల్ రావిపూడి. మొత్తానికైతే డైరెక్టర్ చేసిన సిల్లీ పనికి ఒక ప్రాణం పోయేది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
అదే జరిగితే అనిల్ A1, నరేష్ A2..
ఇక తర్వాత వీటీవీ గణేష్ మాట్లాడుతూ.. అది రియల్ గన్ అని తెలిసిన తర్వాత.. ఒకవేళ నేను చనిపోయి ఉండి ఉంటే, A1గా అనిల్, A2 గా నరేష్ జైల్లో ఉండేవారు అంటూ తెలిపారు గణేష్.