Zebra Censor Cuts: ఈరోజుల్లో టాలీవుడ్‌లో చాలావరకు యంగ్ హీరోలు తమ మార్కెట్‌ను పెంచుకోవడం కోసం ప్యాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు చేరారు. తాజాగా సత్య కూడా ఇదే లిస్ట్‌లో యాడ్ అవ్వనున్నాడు. ఎప్పుడు మొదలుపెట్టాడో, ఎప్పుడు పూర్తిచేశాడో తెలియదు.. ‘జీబ్రా’ అనే ప్యాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. నవంబర్ 22న ఈ మూవీ విడుదలకు సిద్ధం కాగా.. ప్రమోషన్స్ విషయంలో జోరు పెరిగింది. ఇదే సమయంలో ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పూర్తయ్యింది. ఇందులో బూతులు చూస్తుంటే ఇది ఓటీటీలో విడుదల కావాల్సిన సినిమానా అని డౌట్ రావడం పక్కా.
నిడివి ఎంతంటే?
‘జీబ్రా’ సినిమా విడుదలకు ఇంకా రెండురోజులే ఉండడంతో తాజాగా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తానికి ఈ సినిమా డ్యూరేషన్ 164.27 నిమిషాలకు ఫిక్స్ అయ్యింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినా కూడా ఇందులో ప్రేక్షకులు వినలేని ఎన్నో బూతులు ఉన్నాయని సెన్సార్ బోర్డ్ రివీల్ చేసింది. ఫ*కిం*గ్, దెం*గే*య్, బో*చ్చు, మొ*గ్గ, ము*డ్డి, మ*ధ*ర్ చో*ద్ లాంటి బూతులతో సినిమా నిండిపోయిందని, వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయాలని సెన్సార్ ఆదేశించింది. దీంతో ఈ సెన్సార్ సెర్టిఫికెట్ చూసినవారు, ఇలాంటి బూతుల గురించి విన్నవారు ఇది ఓటీటీ సినిమాను అని ఆశ్చర్యపోతున్నారు.
Also Read: విశ్వక్ మరో బూతు సినిమా చేసినట్టు ఉన్నాడు… ఆ బూతులు ఏంటి..?
ప్రేక్షకుల ఆశ్చర్యం
చాలాకాలంగా సినిమాల్లో రక్తపు మరకలను బ్లాక్ కలర్‌లో మార్చి చూపిస్తున్నారు. ‘జీబ్రా’లో కూడా అదే జరగనుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక క్లీవేజ్ సీన్ ఉండగా దానిని కూడా గ్రాఫిక్స్‌తో కవర్ చేయమని సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. మామూలుగా సత్యదేవ్ అంటే ఒక ఫ్యామిలీ హీరో అని ఆడియన్స్‌లో ఒపినీయన్ క్రియేట్ అయ్యింది. అలాంటి హీరో సినిమాలో ఇలాంటి బూతులా అని కూడా వారు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అందించడానికి సత్యదేవ్ సిద్ధమయ్యాడు. మామూలుగా ఈ హీరో స్క్రిప్ట్ సెలక్షన్ బాగుంటుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అదే విధంగా ‘జీబ్రా’కు పాజిటివ్ టాక్ వస్తే సత్యదేవ్ ఖాతాలో మొదటి పాన్ ఇండియా హిట్ పడడం ఖాయం.
అన్ని భాషల్లో
ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన సినిమానే ‘జీబ్రా’. ఈ మూవీలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించింది. ‘పుష్ఫ’తో తెలుగులో విలన్‌గా ఫేమ్ సంపాదించుకున్న ధనంజయ్.. ‘జీబ్రా’తో మరోసారి తనలోని విలనిజం చూపించడానికి సిద్ధమయ్యాడు. వీరితో పాటు ఈ సినిమాలో ఊర్వశి రౌతెలా, సునీల్, సత్య వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నవంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది ‘జీబ్రా’. ఇప్పటికే ఈశ్వర్ కార్తిక్‌కు దర్శకుడిగా కన్నడ, తమిళ పరిశ్రమల్లో మంచి గుర్తింపు ఉండగా.. ఇప్పుడు ‘జీబ్రా’తో తను తెలుగులో అడుగుపెడుతున్నాడు.