Ram Charan: చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేశాడు. రామ్ చరణ్ కెరీర్ కి మగధీర సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. అయితే రీసెంట్ టైమ్స్ లో రాంచరణ్ కొన్ని వ్యవహారాల్లో వెనక్కి తగ్గుతున్నాడు కానీ ఒకప్పుడు రామ్ చరణ్ వేరు. రామ్ చరణ్ చుట్టూ చాలా వివాదాలు అప్పట్లో తిరుగుతూ ఉండేవి. నాయక్ సినిమా ఆడియో లాంచ్ లో చాలామంది మీడియా వాళ్ళను కూడా లెక్క చేయలేదు చరణ్. మీరు ఎన్ని కథనాలు రాసిన కూడా అవన్నీ కూడా మాకు ఒక వెంట్రుకతో సమానం అంటూ బహిరంగంగా తెలిపాడు. అయితే రామ్ చరణ్ ఎంత దైవభక్తితో ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి అయ్యప్ప మాలలో రామ్ చరణ్ తేజ్ కనిపిస్తూ ఉంటాడు. ఈ ఏడాది కూడా రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించారు.
ఒక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 17వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్ తేజ్ ను చాలా రోజుల క్రితం కడప దర్గాకు ఆహ్వానించారు. తన ఆహ్వానాన్ని కాదనలేక రామ్ చరణ్ తేజ్ ఆ రోజుల్లోనే వస్తాను అని మాటిచ్చారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప మాల లో ఉన్నా కూడా కడప దర్గాకు హాజరవాల్సి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం చరణ్ కూడా కడప దర్గాకు హాజరయ్యాడు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం చుట్టూ వివాదం అలుముకుంటుంది. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు రాంచరణ్ తేజ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు.. రామ్ చరణ్ రెహమాన్ ని కూడా తిరుపతి, శబరిలకు తీసుకరాగలరా ? అంటూ తెలంగాణ అయ్యప్ప జేఏసీ సంఘం ప్రశ్నిస్తుంది.
Also Read : Sankranthi ki vasthunnam : డైరెక్టర్ గన్‌తో చంపేసే వాడు… జస్ట్‌లో ఎస్కెప్ అయిపోయా…
రాంచరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంత దైవభక్తితో ఉంటారు అనే విషయం చాలా సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కూడా పలుమార్లు అయ్యప్ప మాలను ధరించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం చరణ్ వెళ్ళవలసి వచ్చింది. అంతేకాని ఎవరి మనోభావాలను దెబ్బతీయటం కానీ, సనాతన ధర్మాన్ని కించపరచడం కానీ, అతని ఉద్దేశం కాదు అని చాలామందికి ఇప్పటికి ఒక క్లారిటీ ఉంది. అయితే కొంతమంది అయ్యప్ప స్వామి భక్తులు దీనిని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దీని గురించి చరణ్ ఏ విధంగా స్పందిస్తారు అని కొంతమంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. లేదంటే సైలెంట్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.
రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి : అయ్యప్ప జేఏసీ
ఏ ఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు.. రామ్ చరణ్ రెహమాన్ ని కూడా తిరుపతి, శబరిలకు తీసుకరాగలరా ?
– తెలంగాణ అయ్యప్ప జేఏసీ pic.twitter.com/C0ZKhmHL9M— ChotaNews (@ChotaNewsTelugu) November 20, 2024