Sankranthiki Vasthunnam: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ముందుగా రచయితగా కెరియర్ మొదలు పెట్టిన అనిల్ పటాస్ సినిమాతో దర్శకుడుగా మారాడు. ఆల్మోస్ట్ కళ్యాణ్ రామ్ కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అయిన తర్వాత అనిల్ రావిపూడి కి వరుసగా అవకాశాలు వచ్చాయి. వెంటనే మెగా హీరో సాయి తేజ తో సుప్రీమ్ అనే సినిమాను చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో అనిల్ రావిపూడి కి మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పటివరకు అనిల్ కెరియర్ లో చేసిన ఎక్కువ సినిమాలను ఈ బ్యానర్ నిర్మించింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో వస్తున్న సినిమా సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.
సంక్రాంతి సీజన్ కి దిల్ రాజుకి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సీజన్ వస్తుందంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఖచ్చితంగా ఒక సినిమా విడుదలవుతుంది. అలా ఆ బ్యానర్ నుంచి ఆ సీజన్లో విడుదలైన ఎన్నో సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన దాఖలాలు ఉన్నాయి. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఎఫ్3 కూడా మంచి హిట్ అయింది. మరోసారి వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పుడిప్పుడే బజ్ విపరీతంగా పెరుగుతుంది. దీని కారణం ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గోదారి గట్టుపైన సాంగ్. ఈ సాంగ్ ఇప్పుడు విపరీతంగా పాపులర్ అవుతుంది. కేవలం తెలుగులోనే 50 మిలియన్స్ వ్యూస్ కు పైగా సంపాదించింది.
Also Read : Puri Jagannadh : చేత కాకపోతే చచ్చిపోయి పైకి వచ్చేయ్
ఈ పాటను రమణ గోగుల ఆలపించారు. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు మ్యూజిక్ అందించే రమణ గోగుల కొన్నేళ్లపాటు సంగీతానికి గ్యాప్ ఇచ్చారు. మళ్లీ దాదాపు 16 సంవత్సరాలు తర్వాత రమణ గోగుల పాడిన పాట బాగా పాపులర్ అయింది. గతంలో వెంకటేష్ నటించిన లక్ష్మి సినిమా కి కూడా రమణ గోగుల సాంగ్స్ అందించారు. ఇప్పుడు రమణ గోగుల పాడిన పాట 50 మిలియన్ వ్యూస్ రావడంతో సోషల్ మీడియాలో రమణ గోగుల రీయంట్రీ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ కాబట్టి కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
A Magical Melody that’s winning hearts and has become everyone’s favourite across all age groups💥#GodariGattu is the most celebrated song of the season, with 50MILLION+ VIEWS & 480K+ Likes in just 3weeks❤️🔥
Keep vibing to #SankranthikiVasthunam First Single ❤️
—… pic.twitter.com/nuwbz2ah69— Sri Venkateswara Creations (@SVC_official) December 28, 2024