Mohan Babu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. మోహన్ బాబు కెరియర్లు ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ముందుగా విలన్ గా కొన్ని పాత్రలు పోషించిన మోహన్ బాబు ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా కూడా రాణించారు. మోహన్ బాబు హీరోగా చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మోహన్ బాబు నటించిన కొన్ని సినిమాలలో జేసుదాసు పాడిన పాటలు మోహన్ బాబుకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవి. మోహన్ బాబు కెరియర్లో కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఎప్పుడు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే వాటన్నిటిని మోహన్ బాబు ఇప్పుడు ట్విట్టర్ వేదికగా గుర్తు చేయడం మొదలుపెట్టారు. ఇదివరకే కొన్ని సినిమాలలోని సీన్స్ ని కట్ చేసి ట్విట్టర్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఆ టీం కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా గతంలో ఎన్నో సినిమాలలో తన పాత్రలో ప్రత్యేకతను చెబుతూ మాట్లాడారు వాటిల్లో రాయలసీమ రామన్న చౌదరి సినిమా గురించి మాట్లాడింది మాత్రం చాలా మందికి బాగా కనెక్ట్ అయింది.
ఇకపోతే రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడారు మోహన్ బాబు. ఈ సినిమాలో నేను శివన్న అనే క్యారెక్టర్ ను పోషించాను. ఇది నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ప్రభాస్ తో నటించడం అనేది ఆనందకరమైన విషయం. ఈ రోల్ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం విలనిజం మాత్రమే కాకుండా మోహన్ బాబు లోని మరో కామెడీ యాంగిల్ ను కూడా బయటకు తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ రాసిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అలానే క్యారెక్టర్రైజేషన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలామందికి ఇది ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు.
Also Read : Sankranthiki Vasthunnam: రమణ గోగుల రీ ఎంట్రీ బ్లాక్ బస్టర్
లేకపోతే ప్రభాస్ కెరియర్లో బుజ్జిగాడు సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చాలామంది మర్చిపోయారు. కానీ అసలైన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ప్రభాస్ లో ఎలా ఉంటుందో అని చూపించింది మాత్రం పూరి జగన్నాథ్. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మాట్లాడిన ప్రతి డైలాగ్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ కామిక్ టైమింగ్ డైలాగ్ డెలివరీ వాయిస్ మాడ్యులేషన్ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక మాస్ కమర్షియల్ సినిమాలో ఉండవలసిన అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్.
🎥 Bujjigadu (2008), an action-comedy movie written & directed by the talented Sri. Puri Jagannadh and produced by Sri. K. S. Rama Rao. 💥✨
Acting as ‘Sivanna’ in a powerful character was an experience I truly cherished. 🔥 Sharing the screen with darling ‘Prabhas’ was an… pic.twitter.com/eBKPctCbGO
— Mohan Babu M (@themohanbabu) December 28, 2024