BigTV English

Puri Jagannadh : చేత కాకపోతే చచ్చిపోయి పైకి వచ్చేయ్

Puri Jagannadh : చేత కాకపోతే చచ్చిపోయి పైకి వచ్చేయ్

Puri Jagannadh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట నెగిటివ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేసాడు పూరి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. రీసెంట్ టైమ్స్ లో పూరి హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది అని చెప్పాలి.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.


రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్ అయింది. దాదాపు పూరి కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా హిట్ పూరి కెరీర్ కి బాగా ప్లస్ అయింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందంటే ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చేసిన పరిస్థితి. కొంతమంది పూరీ జగన్నాథ్ ఇంటిముందు ధర్నా కూడా చేస్తాము అంటూ అప్పట్లో మాట్లాడారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ ఫెయిల్యూర్స్ అంతటినీ మించిన సక్సెస్ అందిస్తుంది అని ఊహించరు. వాస్తవానికి హిట్ అవ్వాల్సిన అవసరం కూడా పూరి జగన్నాథ్ కి ఉంది. కానీ ఈ సినిమా ఊహించిన డిజాస్టర్ గా మిగిలిపోయింది. పూరి ఆర్థికంగా ఇంకొంచెం లోపలికి వెళ్లిపోయాడు.

ఇకపోతే పూరి లైఫ్ లో లో అవడం అనేది కొత్త విషయం కాదు. ఇంతకుముందు చాలాసార్లు పూరి జగన్నాద్ లైఫ్ లో లో అయ్యాడు. కానీ అన్నిటిని మించిన లో ఇది అని చెప్పాలి. ఎందుకంటే పూరి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో ఫెయిల్ అయ్యాయి. పూరి ఫెయిల్ అయిన కూడా ఎప్పటికీ కృంగిపోలేదు. ఇక పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. కరోనా టైంలో మొదలు పెట్టిన మ్యూజింగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక ప్రస్తుతం ఇస్మార్ట్ సినిమా తర్వాత కూడా పూరి మళ్లీ మ్యూజింగ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని మరో మ్యూజింగ్ రిలీజ్ చేశాడు పూరి. ఈ మ్యూజింగ్ తో ఎప్పటిలానే ఇన్స్పైర్ చేశాడు పూరి. పూరి సినిమాల్లో బాగా పాపులర్ అయిన అమ్మానాన్న తమిళ అమ్మాయి లోని బాలరాజు క్యారెక్టర్ ను ఉపయోగిస్తూ ఆధ్యంతం ఆసక్తికరంగా మాట్లాడాడు. దేవుడికి బాలరాజు కి మధ్య జరిగిన సంభాషణ చాలామందిని ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక పూరి మార్క్ డైలాగుతో ఏమీ చేత కాకపోతే, చచ్చిపోయి పైకొచ్చేయ్ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×