E-Paper
Advertisement

Sankranthiki vasthunam : దిల్ రాజు ను కాపాడిన బుల్లి రాజు… ఇప్పుడు ఇదే ట్రెండింగ్

Sankranthiki vasthunam : దిల్ రాజు ను కాపాడిన బుల్లి రాజు… ఇప్పుడు ఇదే ట్రెండింగ్
Advertisement

Sankranthiki vasthunam : ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki vasthunam) మూవీతో ఆకట్టుకున్న చిచ్చర పిడుగు బుల్లి రాజు (Bulli Raju) పేరే వినిపిస్తోంది. ఇక తాజాగా ట్రెండింగ్లో దిల్ రాజు (Dil Raju)ను కాపాడింది ఈ బుల్లిరాజే అనే మీమ్స్ సందడి చేస్తున్నాయి. మరి ఈ చిన్న పిల్లాడు ప్రొడ్యూసర్ ని కాపాడడం ఏంటి? అసలు ఈ మీమ్స్ ఎందుకు వైరల్ అవుతున్నాయి? అనే విషయంలోకి వెళ్తే…

దిల్ రాజును కాపాడిన బుల్లి రాజు

Advertisement

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunam) సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు బుల్లి రాజు. ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండిట్లో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాదాపు మూడేళ్ల పాటు ఈ మూవీ షూటింగ్ జరగగా, దిల్ రాజు భారీగానే బడ్జెట్ ను ఖర్చు పెట్టాడు. కానీ అది ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. మూవీ కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయింది. ఇటు భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ విజన్, అటు రామ్ చరణ్ చరిష్మా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. దీంతో దిల్ రాజుకు భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి.

అయినప్పటికీ ధీర రాజు సంతోషంగా ఉన్నారు అంటే ముఖ్య కారణం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ. ఈ మూవీలో కంటెంట్ కంటే ఎక్కువగా బుల్లి రాజు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వంటి నటీనటులు ఉన్నప్పటికీ బుల్లిరాజే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. మూవీలో వీడు చేసే అల్లరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫలితంగా సంక్రాంతి సందర్భంగా పిల్లాజెల్లాను పట్టుకుని, ఫ్యామిలీలు ఫ్యామిలీలు థియేటర్ల బాట పట్టాయి. ఇంకేముంది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏకంగా 200 కోట్లకు పైగానే కొల్లగొట్టింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఈ రేంజ్ లో వసూళ్ల రాబడుతుందని కనీసం నిర్మాత దిల్ రాజు కూడా ఊహించలేదు. ఇదే విషయాన్ని ఆయన మూవీ సక్సెస్ మీట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ మూవీ కూడా ‘గేమ్ ఛేంజర్’లాగా డిజాస్టర్ అయ్యి ఉంటే, నిర్మాత దిల్ రాజు పరిస్థితి ఎలా ఉండేదో. ఈ నేపథ్యంలోనే బుల్లి రాజు దిల్ రాజుని కాపాడాడు అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

Advertisement

ఈ బుల్లి రాజు ఎవరు ?

‘సంక్రాంతికి  వస్తున్నాం’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బుల్లి రాజు అసలు పేరు భీమాల రేవంత్ పవన్ సాయి సుభాష్. అయితే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి, డైరెక్టర్ అనిల్ రావిపూడి దృష్టిలో పడ్డాడు. ఇక సంక్రాంతి తర్వాత ఈ బుల్లి రాజుకి 15 వెబ్ సిరీస్ లు, 4 సినిమాలలో అవకాశాలు వచ్చాయట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×