Vijayasai Reddy: ఆ నేత చెప్పారు. చెప్పినట్లే చేశారు. ఇటీవల ఎవరి నోట విన్నా, ఆ నేత పేరే. ఇక రాజకీయాలు వద్దనుకున్నారు. వ్యవసాయమే ముద్దనుకున్నారు. అన్నట్లే రైతన్నగా మారి, ఆ ఫోటోలను ట్వీట్ చేశారు. ఇప్పటికే ఆ రాజకీయాలకు స్వస్తి పలికిన పేరు మీ నోటి వెంట వచ్చిందా.. ఔను ఆయనే విజయ సాయిరెడ్డి. తాను వ్యవసాయంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందంటూ కొన్ని ఫోటోలను సాయిరెడ్డి విడుదల చేశారు.
ఇటీవల వైసీపీకి సాయిరెడ్డి రాజీనామా చేయడంతో పాటు, రాజ్యసభ సీటుకు కూడ రాజీనామా చేశారు. అలా రాజీనామా చేశారో లేదో ఆమోదం కూడ లభించింది. అయితే రాజీనామా చేసే సమయంలో తాను ఇక రాజకీయాల్లో జోక్యం చేసుకోనని, అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉందన్నారు. అంతేకాకుండ తాను ఇక వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో వైసీపీ క్యాడర్ షాక్ కు గురికాగా, ఏపీ రాజకీయంలో ఇదే చర్చగా సాగింది. అయితే సాయిరెడ్డి మాత్రం తాను చెప్పినట్లే అన్నంత పని చేశారు.
Also Read: AP Housing Scheme: ఉచితంగా ఇంటి స్థలం.. ఈ రూల్స్ మాత్రం మరచిపోవద్దు!
సోమవారం సాయంత్రం తన ట్విట్టర్ ఖాతా ద్వార వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఫోటోలను విడుదల చేశారు. అది కూడ ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నట్లు, సాగు పనుల్లో నిమగ్నం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి నెటిజన్లు మీరు సూపర్ సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో సాయిరెడ్డికి గవర్నర్ పదవి వరించబోతోందని ఓ వైపు ప్రచారం సాగుతున్న తరుణంలో, సాగు పనుల్లో ఉన్న ఫోటోలను సాయిరెడ్డి విడుదల చేయడం విశేషం.
I am happy to share that I have embarked on a fresh approach to my horticulture operations. pic.twitter.com/q2Gq5UNGgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025