BigTV English

Saripodhaa Sanivaaram OTT: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Saripodhaa Sanivaaram OTT: నాని ‘సరిపోదా శనివారం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కొత్త కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. గతేడాది వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో ‘దసరా’ మూవీలో నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. అంతేకాకుండా కలెక్షన్లలో దుమ్ముదులిపేసింది. నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా దసరా మూవీ నిలిచింది.


ఈ మూవీ సక్సెస్‌తో నాని మరో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈసారి కూడా మరో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు. ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తండ్రి కూతుళ్ల మధ్య చిత్రీకరించిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి. అలా ఈ సినిమా కూడా గతేడాది చివర్లో వచ్చి మరో బ్లాక్ బస్టర్ అందించింది.

ఇక ఈ సినిమా హిట్‌తో నాని మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తనకి ఇదివరకు ‘అంటే సుందరానికి’ మూవీతో ఫ్లాప్ అందించిన దర్శకుడు వివేక్ ఆత్రేయకి మరో ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. వారి అంచనాలకు తగ్గట్టుగా మేకర్స్ కూడా పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్‌లతో మరింత హైప్ పెంచేశారు.


Also Read: ‘సరిపోదా శనివారం’ ప్రమోషనల్ సాంగ్.. నాని స్టెప్పులు అదుర్స్

ఇక ట్రైలర్‌తో సినిమా రేంజ్ మారిపోయింది. ఇలా వరుస అప్డేట్‌లతో మేకర్స్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. మొత్తంగా భారీ అంచనాలతో ఈ సినిమా ఆగస్టు 29న అంటే ఇవాళ రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ వేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దీంతో నాని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఈ సినిమాలో హీరోగా నాని ఎంట్రీ అదిరిపోయిందని చెబుతున్నారు. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ దుమ్ము దులిపేశాయని చెప్పుకొస్తున్నారు. నాని మాస్‌ లుక్‌లో సర్‌ప్రైజ్ చేశాడని.. అతడి యాక్షన్ అండ్ రగ్గడ్ లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇందులో నాని డిఫరెంట్‌గా కనిపించి కనువిందు చేశాడని చెప్పుకొస్తున్నారు. అలాగే నానితో పాటు ఇందులో విలన్‌గా చేసిన ఎస్ జే సూర్య యాక్టింగ్ అద్భుతంగా ఉందని అంటున్నారు.

ఇక ఇవాళ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ పై కూడా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లీక్ అయిన వివరాల ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో ఈ సినిమా పక్కాగా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక హిందీ వెర్షన్ మాత్రం జియో సినిమాలో ప్రసారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×