Satya Dev: ఒక సినిమా విజయం సాధించాలి అంటే.. కథ ఉండాలి.. దాంతో పాటు ప్రమోషన్స్ వేరే రేంజ్ లో ఉండాలి. ఈకాలంలో సినిమాలో ఏం లేకపోయినా.. ప్రమోషన్స్ లో మాత్రం ఏదో ఉందని చూపించి జనాలను పిచ్చోళ్ళను చేస్తున్నారు చాలామంది. ఇక ప్రమోషన్స్ ఇంటర్వ్యూల్లో కానీ, మీడియా సమావేశంలో కానీ ఏ రిపోర్టర్ అయినా ఏదైనా ఒక ప్రశ్న అటు ఇటుగా అడిగితే.. ఆరోజు మొత్తం సోషల్ మీడియాలో వారిపై నెటిజన్స్ విరుచుకుపడుతుంటారు.
వీళ్లు అసలు జర్నలిస్టులేనా.. ? ఎలాంటి ప్రహ్నాలు అడగాలో వారికి తెలియదు.. ? ఒక హీరోతో ఇంకో హీరోకు పోలిక ఏంటి.. ? ఈ హీరోను తక్కువచేసి మాట్లాడుతున్నారు.. ? ఆ హీరోయిన్ ను వల్గర్ ప్రశ్న వేశారు.. ? ఇలా ట్రోల్ చేసి వదిలేస్తుంటారు. ఇక ఇప్పుడు ఆ ట్రోలింగ్ నే ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు ఒక హీరో. అతను ఎవరో కాదు సత్యదేవ్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారిన సత్యదేవ్ ప్రస్తుతం జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Unstoppable With NBK :బన్నీలో ఈ యాంగిల్ కూడా ఉందా.. స్నేహ రెడ్డికి తెలిస్తే పరిస్థితి ఏంటో..?
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో డాలీ ధనుంజయ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. సత్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సత్యదేవ్.. సోషల్ మీడియాను షేక్ చేసే విధంగా ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేశాడు.
నటుడు బ్రహ్మాజీ గురించి, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక జీబ్రా ప్రమోషన్స్ కోసం సత్యదేవ్.. బ్రహ్మాజీని రంగంలోకి దింపాడు. వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బ్రహ్మాజీ.. సత్యదేవ్ ను చాలా దారుణంగా అవమానించాడు. అవమానించాడు అనడం కన్నా కించపరిచాడు అని చెప్పాలి.
రావడం రావడమే.. ” నువ్వు.. డ్యాన్స్.. దానికోసం జనాలు వెయిటింగ్.. ఆ హుక్కా.. బొక్కా” అంటూ సత్యదేవ్ ను ట్రోల్ చేశాడు. ‘జీబ్రా అంటే పోలోమని జనాలు వచ్చేస్తారా.. ?’ ‘చెప్పాలిగా మీ సినిమా గురించి ఎవడికి తెలియదు’. ‘ నా గురించి నీకెందుకు.. నీ ప్రమోషన్స్ కు నీ యాక్టర్స్ యే రావడం లేదు’ ‘ హీరోయిన్ ఎక్కడ.. ఫారిన్ లో ఉందని చెప్పుకోవాలి.. అంతే’ ‘ ముందు కళ్ళజోడు తీయ్.. ప్రభాస్ అనుకుంటున్నావా.. ? ‘ ‘సలార్ మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టుకుంటే మాస్ హీరోవి అయిపోదామనుకుంటున్నావా.. ? ‘.. ‘ఫీల్ అవ్వకు చాలా దరిద్రంగా ఉన్నావ్’ అని చాలా వల్గర్ లాంగ్వేజ్ లో సత్యదేవ్ ను రోస్ట్ చేసేశాడు.
ఇక ఈ వీడియోకు బ్రూటల్ బ్రహ్మాజీతో జీబ్రా అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రోమో కనుక రీచ్ ఎక్కువ వస్తే ఫుల్ వీడియోను పోస్ట్ చేస్తామని తెలిపారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చాలామంది ఈ వీడియోపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా బ్రహ్మాజీ..ఇవే ప్రశ్నలు మీడియా అడిగితే.. రచ్చ రచ్చ చేస్తారు. మీకు మీరు మాట్లాడుకుంటే దాన్ని ప్రమోషన్ అని అనుకోవాలా.. ? అని మండిపడుతున్నారు. ఇంకొంతమంది ప్రోమోలోనే ఇంత ఫైర్.. వీడియోలో ఏం ఉండదు.. ఎన్ని చూడలేదు అని పెదవి విరుస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Brutal Brahmaji with the #zebra !!
Promo baaga reach ayithe full video release chestham 😁😁#zebra on #nov22 pic.twitter.com/G2ooJRFGXU
— Satya Dev (@ActorSatyaDev) November 15, 2024