BigTV English

Actor Suriya: 10 యేళ్లు..10 సినిమాలు..9 మంది స్టార్ డైరెక్టర్స్..అయినా వరించని అదృష్టం..తప్పెవరిది..?

Actor Suriya: 10 యేళ్లు..10 సినిమాలు..9 మంది స్టార్ డైరెక్టర్స్..అయినా వరించని అదృష్టం..తప్పెవరిది..?

Actor Suriya:కోలీవుడ్ స్టార్ హీరోగా, జాతీయ అవార్డు గ్రహీతగా పేరు తెచ్చుకున్నారు సూర్య (Suriya). ఇంత క్రేజ్ ఉన్న ఈయనకి బాక్స్ ఆఫీస్ వద్ద గత పది సంవత్సరాలుగా ఒక్క హిట్ లేదంటే ఎవరైనా నమ్మగలరా..? ఇది అక్షర సత్యం. దాదాపు 10 ఏళ్లలో 10 చిత్రాలు చేశారు. అందులోనూ 9 మంది స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసారు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయారు. మరి తప్పు ఎవరిది..? సూర్యని ప్రెసెంట్ చేయడంలో డైరెక్టర్స్ తడబాటు పడ్డారా? లేక కథల ఎంపిక విషయంలో సూర్య వెనుకడుగు వేశారా? అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.


విమర్శించే స్థాయి నుంచి ప్రశంస అందుకునే స్థాయి వరకు..

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లల్లో నటన రాదు.. డాన్స్ చేయలేరు అంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే సినిమా సినిమాకి తనను తాను నిరూపించుకుంటూ.. ఇప్పుడు అందరి చేత స్టార్ హీరోగా పిలిపించుకుంటున్నారు. అయితే నటన రాదని విమర్శించిన వారి ముందే..తనకంటే మంచి నటుడు లేడని చెప్పుకునే స్థాయికి ఎదిగిన సూర్య.. గత పది సంవత్సరాలుగా బాక్సాఫీస్ హిట్ చూడలేదు. సూర్యకి బాక్స్ ఆఫీస్ వద్ద చివరిగా భారీ విజయాన్ని అందించిన చిత్రం ‘సింగం 2’. 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూర్యకు మంచి ఇమేజ్ తో పాటు భారీ కలెక్షన్స్ కూడా అందించింది. ఈ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్లలో ఆయన ఒక్క హిట్ కూడా చూడకపోవడం ఆయన తదుపరి వృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది అని చెప్పవచ్చు.


బాక్స్ ఆఫీస్ హిట్ కోసం పదేళ్లుగా పోరాటం..

ముఖ్యంగా సూర్యతో పాటు ఇండస్ట్రీలో సమకాలీన నటులుగా చలామణి అవుతున్న విజయ్ ,(Vijay), అజిత్ (Ajith) ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంటే.. సూర్య మాత్రం రూ.40 కోట్లు కూడా చేరుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే.. ఈ పది సంవత్సరాలలో సూర్య కేవలం రెండు హిట్ సినిమాలు మాత్రమే చేశారు. అందులో ఒకటి సురారై పోట్రు.. మరొకటి జై భీమ్. అయితే ఈ రెండు కూడా నేరుగా ఓటీటీ లో విడుదలయ్యాయి. ఇలా కాకుండా థియేటర్లలో వచ్చి ఉంటే ఖచ్చితంగా సూర్య మార్కెట్ పెరిగేది. అలా కంటెంట్ లో బలం ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల వెనుకడుగు వేసిన సూర్య మార్కెట్ ని కూడా పోగొట్టుకున్నాడు.

స్టార్ డైరెక్టర్లతో సినిమాలు..

ఇకపోతే సింగం 2 తర్వాత సూర్య నటించిన మేము ( పాండిరాజ్), 24 (విక్రమ్ కుమార్), సింగం 3 (హరి), గ్యాంగ్ (విఘ్నేష్ శివన్), ఎన్జీకే (సెల్వ రాఘవన్ ), ఎతర్కుమ్ తునింధవన్ (పాండిరాజ్), కాప్పాన్ ( కే. వీ. ఆనంద్), పసంగ 2( పాండిరాజ్), మస్సు ఎంగిర మసిలామణి (వెంకట ప్రభు), అంజన్ ( ఎన్. లింగుస్వామి).. ఇలా దాదాపు 10 సంవత్సరాలలో 10 సినిమాలు..అందులోనూ 9 మంది స్టార్ డైరెక్టర్లతో సినిమా చేశారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క విజయం కూడా ఆయనను వరించలేదు. అయితే దీనంతటికీ కారణం సూర్య కథల ఎంపికే అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కథ బాగలేకపోతే సినిమా ఆడదు. నటనలో తన వంతు ఎంత కృషి చేసినా ఫలితం లభించదు. దీనికి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘కంగువ’ అని చెప్పవచ్చు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సూర్య రెండేళ్లు కష్టపడ్డారు. కానీ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది విడుదల కానున్న ‘సూర్య 44’ వ చిత్రం కోసం సూర్యతో పాటు అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×