E-Paper
Advertisement

Tenant Trailer: భార్యలను చంపడమే పనిగా పెట్టుకున్నావా.. సత్యం రాజేష్ అన్నా..

Tenant Trailer: భార్యలను చంపడమే పనిగా పెట్టుకున్నావా.. సత్యం రాజేష్ అన్నా..
Advertisement

Tenant Trailer:టాలీవుడ్ లో కథలకు కొదువే లేదు. రొట్ట సినిమాలకు దూరంగా కొత్త కథలను ఎంచుకొని చిన్న చిన్న హీరోలై సైతం హిట్లు అందుకుంటున్నారు. అందులో సత్యం రాజేష్ ఒకడు. కమెడియన్ గా సత్యం సినిమాతో పేరుతెచ్చుకున్న ఆయన.. ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇక ఇలా కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చిన సత్యం రాజేష్.. కరోనా సమయంలో పొలిమేర సినిమాతో హీరోగా మారాడు. ఓటిటీలో రిలీజ్ అయినా ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా గతేడాది పొలిమేర 2 వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక పొలిమేర 2 చివర్లో సత్యం రాజేష్.. భార్యను చంపడానికి ప్లాన్ చేస్తాడు. అది మిస్ ఫైర్ అయ్యి ఆమె.. అతనిని చంపేస్తుంది. ఇక ఈ ట్విస్ట్ కు థియేటర్ లో రెస్పాన్స్ మాములుగా రాలేదు. ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈ హీరో ..మరో మంచి కథతో రాబోతున్నాడు. సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న సినిమా టెనెట్. వై. యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 19 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఇదొక క్రైమ్ సస్పెన్స్ కథగా తెలుస్తోంది.ఇందులో హీరో ఒక సాఫ్ట్వేర్. ఊరు వదిలి హైదరాబాద్ కు వచ్చి ఆరేళ్ళు అవుతున్నా ఇంటికి వెళ్ళడు. ఇక అతనికోసమే ఐదేళ్లుగా మరదలు పెళ్లి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈలోపే సడెన్ గా హీరోకు మరో అమ్మాయితో పెళ్లి అవుతుంది.

Advertisement

ఇక పెళ్లి అయ్యి మూడు నెలలు కూడా కాకముందే భార్యను చంపేస్తాడు హీరో. అంతేకాకుండా డైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు లోణిగిపోతాడు. అసలు భార్యను హీరో ఎందుకు చంపుతాడు..? హీరో ఇంటిపైకి అద్దెకు వచ్చిన టెనెట్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ మొత్తంలో సత్యం రాజేష్ సీరియస్ నెస్ మెయింటైన్ చేశాడు. మరదలిని ప్రేమించి.. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తికి.. తనలాగే మరొక అబ్బాయిని ప్రేమించి తనను పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితంలో జరిగిన కథనే టెనెట్. ఇక ఈ ట్రైలర్ ను చూసిన అభిమానులు.. భార్యలను చంపడమే పనిగా పెట్టుకున్నావా.. సత్యం రాజేష్ అన్నా.. అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×