BigTV English

Prabhas : ఇటలీలో ప్రభాస్‌‌కు రహస్యంగా సర్జరీ… ఇక 6 నెలల పాటు…!

Prabhas : ఇటలీలో ప్రభాస్‌‌కు రహస్యంగా సర్జరీ… ఇక 6 నెలల పాటు…!

Prabhas :ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ పాపులర్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas).. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్. ఇక ఆ తర్వాత నుంచీ తాను తీసే ప్రతి చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తూ.. ప్రతి ఒక్కరికి మరింత చేరువయ్యారు. ముఖ్యంగా నార్త్ అభిమానులు ప్రభాస్ యాక్షన్ పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు. ఇందుకు నిదర్శనం ‘సాహో’ సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలతో నిరాశపరిచినా.. ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి సినిమాలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అంతేకాదు ఈ సినిమాలతో మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించారు ప్రభాస్.


వరుస సినిమా లైనప్ తో బిజీగా మారిన ప్రభాస్..

ఇక ప్రస్తుతం మారుతి (Maruthi) డైరెక్షన్లో రాజా సాబ్ (Rajasaab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్స్ పూర్తయిన వెంటనే.. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయింది . ఇక ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్గా ఆయన ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . ఈ విషయం విని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్ కి ఏమైంది? ఎందుకు ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు ?అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.


ప్రభాస్ కాలుకి సర్జరీ.. ఆరు నెలలు బెడ్ రెస్ట్..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ కి ఇటీవల తీవ్ర గాయం కావడంతో.. ఆయన ఇటలీలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి అంతస్థు నుండి ప్రభాస్ కిందకు జారి పడడంతోనే కాలుకు తీవ్ర గాయం అయిందని, ఆయనను వెంటనే ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ కాలి నరాలు దారుణంగా దెబ్బతిన్నాయని, అందుకే ఫిబ్రవరి 28న ఆయన ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అందుకే ప్రభాస్ కి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారట. ఇకపోతే ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ఆయన పి ఆర్ టీం పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ విషయం ఏదో లాగా బయటపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్ కి ఏమైంది? ఎందుకు ఈ విషయాలు బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు? అంటూ ఫైర్ అవుతున్నారు.

Chhaava Telugu: తెలుగు వెర్షన్ కి కొత్త కష్టాలు… బ్యాన్ చేయాలంటూ డిమాండ్..!

గతంలో కూడా ఇలాంటి వార్తలు..

ఇదిలా ఉండగా గతంలోనే ప్రభాస్ ఆరోగ్యం పై ఇలాంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనకు పెద్ద సర్జరీ జరిగిందని , ఆయన ఇండియాలో లేడని, మీడియాకి కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారంటూ వార్తలు రాగా.. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వార్తలు రావడంతో ఇది నిజమని అందరూ నమ్ముతున్నారు . మరి దీనిపై ప్రభాస్ బృందం ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. మొత్తానికైతే ప్రభాస్ కాళ్ళకి బాగా దెబ్బ తగిలిందని, ఆరు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పడంతో అభిమానులు కంగారుపడుతున్నారు. ప్రభాస్ చేయాల్సిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు మరో ఆరు నెలలు వాయిదా పడబోతున్నాయని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×