Daggubati on Chandrababu: ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. చరిత్ర గతిని మార్చిన మహానుభావుల పాలనపై వివరాలను సేకరించానని వివరించారు. ‘ప్రపంచ చరిత్ర’ పేరిట ఆయన రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో జరిగింది. పుస్తకం విడుదలకు ముందు వెంకటేశ్వరరావు మాట్లాడారు.
ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు మనసులోని మాట బయటపెట్టారు.ఈ పుస్తకం ఎలా రాశావని చాలా మంది తనను అడిగారని, రచనకు ముందు చాలా కృషి జరిగిందన్నారు. తాను సైన్స్ స్టూడెంట్ మాత్రమేనని, ఎంబీబీఎస్ చదివానని గుర్తు చేశారు. సోషల్ స్టడీస్‌కు సంబంధించిన అనుభవం, పరిజ్ఞానం అంతగా తనకు లేదన్నారు.
చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని చాలా సార్లు ఆలోచించానని తెలిపారు దగ్గుబాటి. పుస్తకాలు ఎక్కడ దొరికినా తొలుత కొనుగోలు చేసి నాయకుల చరిత్రలు అభ్యసించడం మొదలుపెట్టానని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు చరిత్రేంటి అనే విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. ప్రపంచ చరిత్ర రాయాలంటే చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు.
పుస్తకం రాసేముందు టెక్నాలజీ గురించి ఆయన తెలుసుకున్న విషయాలు బయటపెట్టారు. రానున్న ఐదేళ్లలో కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశముందన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మనిషి ఇంకో 50 ఏళ్లు అదనంగా బతికే టెక్నాలజీ వస్తుందని తెలిపారు. ఇదే సమయంలో తోడల్లుడు, సీఎం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని చలోక్తులు వేశారు.
ALSO READ: వివేకా హత్య కేసు కొత్త మలుపు, కీలక సాక్షి రంగన్న మృతి
చంద్రబాబు మరో 50 ఏళ్లు బతికితే.. మీ అబ్బాయి బాధపడుతారంటూ నవ్వుతూ చమత్కరించారాయన. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులు నవ్వు ఆపుకో లేకపోయారు. రానున్న రోజుల్లో మన బ్రెయిన్ మన పిల్లలకు ట్రాన్స్ ఫర్ చేయవచ్చన్నారు. తాను పుస్తకం రాస్తున్నప్పుడు టెక్నాలజీ గురించి అనేక విషయాలు తెలిశాయని చెప్పారు. మాలాంటివారు మరో ఐదేళ్లు బతికితే.. మరో 50 ఏళ్లకు ప్లాన్ వేయవచ్చని మనసులోని మాట బయటపెట్టారాయన.
ఆ తర్వాత మాట్లాడారు సీఎం చంద్రబాబు. మా ఫ్యామిలీ ఎన్ని కష్టాలున్నా హ్యాపీగా ఉండే వ్యక్తుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరన్నారు ముఖ్యమంత్రి. ఇటీవల ఇద్దరు ఒకసారి కలిశామన్నారు. యాక్టివ్ లైఫ్‌లో ఉన్న మీరు.. రిటైర్డ్ లైఫ్ మాదిరిగా హ్యాపీగా ఎలా ఉన్నారని తాను అడిగినట్టు తెలిపారు. రేపటి నుంచి తనది అదే పరిస్థితని, అందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలన్నారు.
వెంకటేశ్వరరావు బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతానని అన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. మధ్యాహ్నం అయితే ప్లకార్డు ఆడుతానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ నవ్వుకున్నారు. రాత్రివేళ నిద్రపోయే ముందు పిల్లలకు చిన్ని కథలు చెబుతానని అన్నారని, వాటే వరల్డ్ ఫుల్ లైఫ్ అని అన్నారు. ఇప్పటివరకు ఆయన ఐదు పుస్తకాలు రాశారని తెలిపారు సీఎం చంద్రబాబు.
ఒక్కసారి ఆవిష్కరణలు జరిగితే 50 ఏళ్లు ఆగదన్నారు. అగ్రదేశాలన్నీ ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. జనాభా అక్కడ లేదని, టెక్నాలజీ ఆపరేట్ చేసే పరిస్థితి అక్కడ లేదన్నారు. వెంకటేశ్వరరావు చరిత్ర రాస్తుంటే.. పక్కనే ఉన్న ఆర్థికమంత్రి సీతారామన్ చరిత్ర సృష్టించడానికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడారు.
'ప్రపంచ చరిత్ర' పుస్తకావిష్కరణ సభలో అద్భుత దృశ్యం
ఎమోషనల్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు
ఇద్దరి ఆత్మీయ ఆలింగనంతో చప్పట్లతో మార్మోగిన సభ https://t.co/c3ZdxcX2iL pic.twitter.com/5lKuvixw6v
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2025