Tollywood:”కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్తుంది” అన్నట్టుగానే కొత్త హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్న నేపథ్యంలో.. పాత హీరోయిన్ లకి ఇండస్ట్రీలో అవకాశాలు లభించడం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఒకప్పుడు టాలీవుడ్ లో తమ అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించి, ఆడియన్స్ ని తమ వశం చేసుకున్న ఎంతోమంది హీరోయిన్లు ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఒకరిద్దరు కాదు.. సుమారుగా అందరు హీరోయిన్లు కూడా ఇదే ధోరణి వ్యవహరిస్తున్నారని, అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐరన్ లెగ్ అనే ముద్ర నుండి గోల్డెన్ లెగ్ గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకోవడంపై పలువురు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన శృతిహాసన్, పూజా హెగ్డే..
ముఖ్యంగా శృతిహాసన్ (Shruti Hassan),పూజా హెగ్డే (Pooja Hegde) మొదలుకొని చాలామంది టాలీవుడ్ కి వచ్చిన తర్వాత.. తమ తలరాతను మార్చుకున్నారు.ఇక శృతిహాసన్ కనీసం ఏడాది క్రితం ‘సలార్ ‘ తో పలకరించింది. కానీ పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే మాత్రం మూడేళ్ల నుండి ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఎఫ్ 3 లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇక అప్పటినుండి తెలుగు ఆడియన్స్ కి దూరమైంది. మరొకవైపు తమిళ్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే అక్కడ వరుస సినిమాలకు ఒప్పుకుంటూ తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. శృతిహాసన్ కూడా తాను సైన్ చేసిన డెకాయిట్ మూవీ నుండీ తప్పుకొని కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అలా శృతి హాసన్, పూజా హెగ్డే ఇద్దరూ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు.
బాలీవుడ్ పై కన్నేసిన స్టార్ హీరోయిన్స్..
అటు మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) విషయానికొస్తే.. చిరంజీవి (Chiranjeevi) తో భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కొత్త మూవీకి కమిటీ అయినా దాఖలాలు లేవు. ఇక కల్కిలో బుజ్జి కి అరువు ఇచ్చి.. కొంత మేరా ఫాన్స్ ని మాత్రం సాటిస్ఫై చేసింది. ఇక ప్రస్తుతం వివాహం చేసుకొని వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అలరిస్తోంది.
ముఖ్యంగా తమిళంలో రివాల్వర్ రాణి , కన్ని వీడి వంటి సినిమాలు చేస్తోంది. ఇక నిత్యామీనన్ (Nithya Menon) విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ (Bheemla naik) తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు.
హిందీ వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టిన సమంత..
ఇక అటు సమంత (Samantha)కూడా అంతే. ఇంచుమించు దాదాపుగా టాలీవుడ్ కి దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ తన పుట్టినరోజు సందర్భంగా “మా ఇంటి బంగారం” సినిమాను అనౌన్స్ చేసిన ఈమె, ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో ఇప్పటివరకు అప్డేట్ లేదు. అలాగే బీ టౌన్ లోని “సిటాడెల్ – హనీ బన్నీ ” కంప్లీట్ కాగానే వెంటనే ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది.
ఇక రాశీ ఖన్నా (Rashi Khanna), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) , నయనతార (Nayanthara) కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయకుండా బాలీవుడ్ లోనే తమ ఫోకస్ మొత్తం పెట్టేశారు. అటు కోలీవుడ్, బాలీవుడ్ అంటూ వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కూడా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఇక వీరితోపాటు తమన్న(Tamannaah) వంటి హీరోయిన్లు కూడా టాలీవుడ్ కి దూరం అవుతున్నారని చెప్పాలి. మరి వీరందరికీ టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడం లేదా లేక ఇతర భాషా ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టడం వల్ల తెలుగు ఇండస్ట్రీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.