Shikhar Dhawan: టీమిండియా ఫాస్టెస్ట్ క్రికెటర్లలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకరు. ఈ ధనాధన్ బ్యాటర్ పరుగుల వరద పారిస్తూ భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో మ్యాచ్లలో ఒంటి చేత్తో భారత జట్టుకు విజయాలు అందించాడు. అందుకే అతడిని అంతా గబ్బర్ అని పిలుస్తుండేవారు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్.. ప్రస్తుతం పలు టి-20 లీగ్స్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడి.. ఇందులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా జట్టును ఓడించిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లోని భారత మొదటి మ్యాచ్ ని ఆస్వాదించేందుకు మైదానానికి విచ్చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్ శిఖర్ ధావన్. ఇతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. తన ప్రవర్తనతో ఎప్పుడూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా శిఖర్ ధావన్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక గురువారం బంగ్లాదేశ్ – భారత్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ మ్యాచ్ సందర్భంగా దుబాయిలో సందడి చేసిన శిఖర్ ధావన్.. అక్కడ అతను తన పాత స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు.
అయితే గబ్బర్ మ్యాచ్ చూస్తూ ఉండగా స్టాండ్స్ లో ఒక మిస్టరీ గర్ల్ కూడా కనిపించింది. గబ్బర్ పక్కన ఆమె ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. క్రీడాభిమానులు ఆమె ఎవరంటూ వెతకడం ప్రారంభించారు. కానీ ఆ మిస్టరీ గర్ల్ గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. ఇక వైరల్ గా మారిన ఈ ఫోటోపై క్రీడాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గబ్బర్ ఆ మహిళతో ప్రేమలో పడ్డాడని కొందరు కామెంట్స్ చేయడంతో.. ధావన్ విడాకులు తీసుకున్నందున ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత శిఖర్ ధావన్ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయేషా ముఖర్జీ నుండి విడిపోయినప్పటినుండి ధావన్ వ్యవహారం గురించి ఎటువంటి వార్తలు రాలేదు. ధావన్ పెళ్లి చేసుకున్న ఆయేషా ఆస్ట్రేలియా పౌరురాలు. 2009లోనే ఆయేషా గురించి ఇంట్లో వాళ్లతో గొడవపడి బయటకు వచ్చేసిన శిఖర్ ధావన్.. 2012లో ఆయేషాని పెళ్లాడాడు. వీరి వివాహం సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగింది.
ఇక 2013లో ఆయేషా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఈ జంట మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి 2024 లో విడాకులు తీర్చుకున్నారు. ఇప్పుడు వీరు విడివిడిగా నివసిస్తున్నారు. విడాకుల అనంతరం కోర్టు కొడుకు కష్టడీని ఆయేషా ముఖర్జీకి అప్పగించింది. ఇక ధావన్ తన కొడుకును కలవడానికి ఎటువంటి పరిమితి లేదు. కానీ ధావన్ తన కొడుకును రెండేళ్లుగా చూడలేదని.. ఒక సంవత్సర కాలంగా ఫోన్ లో కూడా మాట్లాడలేదని ఇటీవల తెలిపాడు.
भारत बांग्लादेश मैच के दौरान जबरदस्त वापसी करते हुए शिखर धवन 😋#INDvBAN #ShikharDhawan #Divorce #Shami#shubhmangill #RohitSharma #YuzvendraChahal pic.twitter.com/Qt3fJ5MHkI
— Sudiksha (@Su_diksha) February 21, 2025