BigTV English

Vakeel Saab2 : వకీల్ సాబ్ కు సీక్వెల్.. ఫ్యాన్స్ ఖుషీ..

Vakeel Saab2 : వకీల్ సాబ్ కు సీక్వెల్.. ఫ్యాన్స్ ఖుషీ..

Vakeel Saab2 : పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వకీల్ సాబ్ సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించారు. 2021లో విడుదలైన వకీల్‌సాబ్‌ మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా విశేషాలను వేణు శ్రీరామ్ గుర్తు చేసుకున్నాడు.


బాలీవుడ్‌ మూవీ ‘పింక్‌’కు రీమేక్‌గా వకీల్ సాబ్ వచ్చింది. పవన్‌ కు జోడిగా శ్రుతి హాసన్‌ నటించింది. అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో పోషించారు. ఈ ముగ్గురి పక్షాన పోరాడే న్యాయవాది పాత్రలో పవన్‌ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని కోర్టు సీన్స్ హైలైట్‌గా నిలిచాయి.

దర్శకుడు వేణు శ్రీరామ్‌ వకీల్‌ సాబ్‌ సీక్వెల్‌ పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా పనులు మొదలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని వెల్లడించారు. త్వరలోనే వకీల్ సాబ్ -2 పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సీక్వెల్‌ను ప్రకటించిన వెంటనే వకీల్‌ సాబ్‌ లోని పాటలు, డైలాగులు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం #2YearsForVakeelSaab, #VakeelSaab2
హ్యాష్‌ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి.


పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శతత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ జరుగోతోంది. ఈ రెండు మూవీలు పూర్తైన తర్వాత వకీల్ సాబ్ -2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×