BigTV English

Shaakuntalam Postponed: సమంత ‘శాకుంత‌లం’ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..

Shaakuntalam Postponed: సమంత ‘శాకుంత‌లం’ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..

Shaakuntalam Postponed:స్టార్ హీరోయిన్ సమంత నటించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. దేవ్ మోహన్ ఇందులో దుష్యంత మహరాజు పాత్రలో నటించారు. గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గుణ శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దానికి త‌గిన‌ట్లే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. చివరి నిమిషంలో శాకుంత‌లం సినిమాను మేకర్స్ పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


ఇది వ‌ర‌కు శాకుంత‌లం సినిమాను జ‌న‌వ‌రిలో విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. కానీ వ‌రుసగా పెద్ద సినిమాలు రిలీజ్ ఉండ‌టంతో థియేట‌ర్స్ ఇష్యూ వచ్చే అవ‌కాశం ఉండటంతో ఫిబ్ర‌వ‌రి 17కి వెళ్లారు. తీరా ఇప్పుడు ఆ డేట్‌ను కూడా శాకుంత‌లం రిలీజ్ కావ‌టం లేదు. మ‌రి త‌దుప‌రి రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో తెలియ‌టం లేదు. అయితే మీడియా స‌ర్కిల్స్‌లో వ‌స్తున్న వార్త‌ల మేర‌కు ఏప్రిల్ రెండో వారంలో ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.

క‌వి కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంత‌లంలోని దుష్యంత మ‌హారాజు, శ‌కుంత‌ల మ‌ధ్య ప్ర‌ణ‌య‌మే ఈ సినిమా. గుణ శేఖ‌ర్‌కి దిల్ రాజు స‌పోర్ట్ దొర‌క‌టంతో శాకుంత‌లం సినిమాను ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కించారు. మ్యూజిక్ విషయంలోనూ గుణ శేఖర్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. మణి శర్మ సంగీత సారథ్యం వహించిన శాకుంతలం మూవీ బీజీఎంను బుడాపెస్ట్, హంగేరిలలో రికార్డ్ చేయటం విశేషం. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గుణ శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ చిత్రంలో చిన్న‌నాటి భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ కుమార్తె అర్హ న‌టించింది. దుర్వాస మ‌హా ముని పాత్ర‌లో మంచు మోహ‌న్ బాబు యాక్ట్ చేశారు.


శాకుంతలం సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×