Sukumar : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ సుకుమార్ (Sukumar). ఆయన నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి సుకుమార్ మరో మూవీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ బాలీవుడ్ హీరోని రూరల్ పొలిటికల్ డ్రామా కోసం లైన్ లో పెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ బడా హీరోతో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్
‘పుష్ప 2’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి సుకుమార్ ఓ బాలీవుడ్ హీరోతో భారీ ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ చేయబోయే మూవీ ఇంటెన్స్ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ఇన్నాళ్ళూ టాక్ నడిచింది. కానీ తాజాగా వినిపిస్తున్న బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఇదొక రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సుకుమార్ సినిమాలో షారుక్ ఖాన్ రా అండ్ రస్టిక్ అవతార్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమాలో కొన్ని సామాజిక సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. ఎప్పటిలా కేవలం యాక్షన్ తో ఇరగదీసే స్టార్ హీరోలా కాకుండా కింగ్ ఖాన్ ఈ సినిమాలో ఒక యాంటీ హీరోగా, రా స్టోరీతో, రస్టిక్ అవతార్లో మాస్ అప్పీల్ తో పలకరించబోతున్నట్టు ఇన్సైడ్ వర్గాల సమాచారం. కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే అల్లు అర్జున్ కు ‘పుష్ప’ క్యారెక్టర్ తో ఈ రా అండ్ రస్టిక్ అనేది బాగా సెట్ అయ్యింది. అది అందరు హీరోలకు వర్కౌట్ అవుతుందా? అంటే డౌటే. కానీ ఈ టైపు స్టోరీలను తెరకెక్కించడంలో సుకుమార్ లెక్క కాబట్టి ఏమైనా జరగవచ్చు.
మరో రెండేళ్ళు వెయిటింగ్ తప్పదు
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సుకుమార్ షారుఖ్ ఖాన్ తో చర్చల దృష్టిలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరూ వేరే సినిమాలకు కమిట్ అయ్యారు. సుకుమార్ చెర్రీతోతో ‘ఆర్సి 17’ అనే మూవీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా అల్లు అర్జున్ తో ‘పుష్ప 3’ సినిమాను పూర్తి చేయాలి.
ఇక షారుక్ ఖాన్ కింగ్, పఠాన్ 2 అనే రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేయాల్సి ఉంది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదని సమాచారం. షారుక్ ఖాన్ ‘కింగ్’ మూవీ మే నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది. షారుఖ్ పఠాన్, జవాన్ లాంటి 1000 కోట్ల సినిమాలతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తే, ఆయన చేసిన మరో మూవీ ‘డంకీ’ ఆ ఉత్సాహాన్ని నీరుగార్చింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు.