BigTV English

Star Hero:క్యాన్సర్ తో బాధపడుతున్న మెగాస్టార్..ఎట్టకేలకు స్పందించిన టీమ్..!

Star Hero:క్యాన్సర్ తో బాధపడుతున్న మెగాస్టార్..ఎట్టకేలకు స్పందించిన టీమ్..!

Star Hero.. మెగాస్టార్ అనగానే మనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఒక్కో భాష ఇండస్ట్రీలో ఒక్కో మెగాస్టార్ ఉంటారనటంలో సందేహం లేదు. అలా హిందీలో మెగాస్టార్ అంటే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)పేరు గుర్తుకొస్తే.. మలయాళం లో మమ్ముట్టి (Mammootty) పేరు గుర్తుకొస్తుంది. అలా ఒక్కో భాష ఇండస్ట్రీలో ఒక్కొక్కరు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి, మెగాస్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా మెగాస్టార్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు అంటూ వార్తలు రాగా.. ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో కలవరపడ్డారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించి, క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మరి ఆ మెగాస్టార్ ఎవరు..? ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం ఏంటి? అసలేమైందో ఇప్పుడు చూద్దాం.


కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న మెగాస్టార్..

గత కొన్ని రోజులుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Megastar Mammootty) ఆరోగ్యం పై రూమర్స్ చాప కింద నీరులా వ్యాపించాయి. ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారని,అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారని , కొన్ని మీడియా ఛానల్స్ కథనాలను అల్లేశాయి. ఈ నేపథ్యంలోనే వార్తలు జోరుగా వ్యాపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన టీం స్పందించి, అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని ప్రస్తుతం మోహన్ లాల్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారని తిరిగి మళ్లీ సినిమాలు చేస్తారని కూడా క్లారిటీ ఇచ్చింది.


వార్తలపై స్పందించిన టీమ్..

మమ్ముట్టి టీం తమ ప్రకటనలో ఇలా రాస్తూ..” ప్రస్తుతం మాలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రంజాన్ ఉపవాసం చేస్తున్నారు కాబట్టే ఆయన సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే ఆయన తన షూటింగ్ షెడ్యూల్ ని కూడా వాయిదా వేశారు. విరామం తర్వాత మళ్లీ మోహన్ లాల్(Mohan Lal), మహేష్ నారాయణన్(Mahesh Narayanan) సినిమా షూటింగ్ కి తిరిగి వెళ్తారు. ముఖ్యంగా మమ్ముట్టి క్యాన్సర్ బారిన పడ్డారు అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు.. అవన్నీ ఫేక్”అంటూ క్లారిటీ ఇచ్చారు.

Shree Rapaka: స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఆనందంలో ఏం చేసిందంటే..?

మమ్ముట్టి సినిమాలు..

మమ్ముట్టి సినిమాల విషయానికి వస్తే.. చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) తెరకెక్కించిన కామెడీ చిత్రం “డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్” చిత్రంలో నటించారు. ఈ సినిమా ఏడాది జనవరి 23న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈయన మోహన్ లాల్ తో కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూలు శ్రీలంకలో ప్రారంభం అయ్యింది. అయితే ఈ మూవీకి తాత్కాలికంగా MMMN (మమ్ముట్టి, మోహన్ లాల్ , మహేష్ నారాయణన్)అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇందులో కుంచాకో బోబన్, ఫహద్ ఫాజిల్, నయనతార, దర్శన్ రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మమ్ముట్టి , మోహన్లాల్ ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తున్నారని తెలిసి అటు మలయాళం లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమాతో ఈ దిగ్గజ ద్వయం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×