Shahrukh Khan: హాలీవుడ్ లో అతిపెద్ద, అత్యంత పాపులర్ ఫ్యాషన్ షో అయిన మెటా గాలా సందడి మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు, సినీ ప్రముఖులందరూ కూడా ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొనడం పై ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ఫ్యాషన్ షో పైనే పడింది. ముఖ్యంగా ఈ వేదికపై ర్యాంప్ వాక్ చేయాలి అంటే మూల్యం చెల్లించాల్సిందే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారిగా ఈ వేదికపై కనిపించారు అంటే అమాంతం వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. అందుకే ఎంతైనా చెల్లించడానికి సిద్ధమవుతూ ఉంటారు సెలబ్రిటీలు. ఈ వేదికపై తమ ఫ్యాషన్ సెన్స్ ను నిరూపించుకుంటూ ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక సినీ తారలు స్వర్గధామంగా భావించే ఈ వేదికపై ఒక్కసారైనా కనిపించాలని ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అలాంటి ఈ వేదికపై ప్రపంచ సినీ దిగ్గజాల మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) తనదైన శైలిలో అందరినీ ఆకర్షించారు.
షారుక్ ఖాన్ ధరించిన వాచ్ ప్రత్యేకతలు.
ముఖ్యంగా తన లుక్ తోనే కాదు తాను ధరించిన వాచ్ తో కూడా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు షారుక్ ఖాన్. షారుక్ ఖాన్ నలుపు రంగు దుస్తుల్లో కనిపించి, చేతిలో మంత్రదండం పట్టుకుని మెజీషియన్ అవతారంలో దర్శనమిచ్చారు. చేతికి నాలుగు ఉంగరాలు, మెడలో మెటల్ తో చేసిన పూసల దండలు, వివిధ రకాల చైన్స్ కూడా ఆయన భరించారు. అలాగే కళ్లకు నల్లటి గాగుల్స్ తో చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే షారుక్ పెట్టుకున్న వాచ్ పైనే అందరి దృష్టిపడింది. షారుక్ ధరించిన వాచ్ విషయానికి వస్తే.. ఫిలిప్పే గ్రాండ్ కాంప్లికేషన్స్ 6300G వాచ్ ధరించారు. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ వాచీ తయారీ సంస్థ దీనిని తయారు చేసింది. ఇంకా ఈ అరుదైన, ప్రత్యేకమైన వాచ్ ధర అక్షరాల 2.5 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ.21 కోట్లు. ఇలాంటి అరుదైన వాచ్ ను ధరించి, సినీ తారల కళ్ళు సైతం తన వైపు తిప్పుకున్నారు షారుక్ ఖాన్. అంతేకాదు షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
షారుక్ ఖాన్ తో పాటూ మెట్ గాలా వేదికపై మెరిసిన తారలు..
ఇకపోతే ఈ మెట్ గాలా వేదికపై షారుక్ ఖాన్ తో పాటు కియారా అద్వానీ తొలిసారి బేబీ బంప్ తో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), ఆమె భర్త నిక్ జోనస్ (Nick Jonas), సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా, ఇషా అంబానీ , నటాషా పూనావాలా తదితరులు ఇందులో పాల్గొన్నారు. బ్లాక్ థీమ్ గా ప్రారంభమైన ఈ ఫ్యాషన్ షోలో చిత్ర విచిత్ర వేషధారణతో తమ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు .ఏది ఏమైనా ఈ వేదికపై సినీ తారలు ఒక్కొక్కరు ఒక్కో స్టైలిష్ లుక్ లో కనిపించి, అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Kantara Chapter 1: మళ్ళీ సెట్లో విషాదం..జూనియర్ ఆర్టిస్టు మృతి..!